Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ని బుక్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   15 Dec 2018 4:55 AM GMT
ఎన్టీఆర్‌ ని బుక్ చేస్తున్నారా?
X
వివాదాల‌తో ప్ర‌చారం కొట్టేయ‌డం వ‌ర్మ శైలి. ఏదో ఒక వివాదాస్ప‌ద అంశాన్ని చేర్చ‌డం ద్వారా త‌న సినిమాల‌కు ఉచిత ప్ర‌చారం కొట్టేసేందుకు ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేస్తుంటారు ఆర్జీవీ. త‌న‌కు ఏమాత్రం సంబంధం లేని `భైర‌వ‌గీత‌` ప్ర‌మోష‌న్‌ కోసం 2.0 లాంటి మాష్ట‌ర్ మైండ్ చిత్రాన్ని త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఇష్టానుసారం ఉప‌యోగించుకున్నాడు. ఇక తాను తెర‌కెక్కిస్తున్న ప్ర‌స్తుత సినిమాకి అలాంటి వివాదాల్ని వెతికి మ‌రీ ప‌ట్టుకుంటున్నాడు.

ప్ర‌స్తుతం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అంటూ కొత్త హంగామాకి వ‌ర్మ తెర‌తీయ‌బోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఓ వివాదాన్ని చూపించ‌డం ద్వారా అగ్గి రాజేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ట‌. అయితే త‌న ప్ర‌చార దాహానికి జూ.ఎన్టీఆర్‌ ని బ‌లి చేస్తున్నాడా? అంటూ ఫ్యాన్స్‌లో అప్పుడే ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

ఆర్జీవీ అంత‌గా ఏం వివాదం చూపించ‌బోతున్నాడు? అంటే.. జూనియ‌ర్ అభిమానులు భ‌గ‌భ‌గ మండే ఓ ఎపిసోడ్‌ ని ఆర్జీవీ నెత్తికెత్తుకున్నార‌ట‌. అసలు ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ పై సినిమా తీయ‌డ‌మే ఓ వివాదం అనుకుంటే, ఇందులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ని లాగుతున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం. అన్న‌గారు, న‌వ‌ర‌స న‌ట‌సార్వ‌భౌముడు అయిన సీనియ‌ర్‌ ఎన్టీఆర్ కి జూనియ‌ర్ మాతృమూర్తి అయిన షాలిని గారిని ప‌రిచ‌యం చేసింది ల‌క్ష్మీ పార్వ‌తినే.

ఆ క్ర‌మంలోనే భ‌గ‌భ‌గ మండిన జూనియ‌ర్ త‌న‌ తాత (ఎన్టీఆర్) గారి ఇంట్లోంచి ల‌క్ష్మీ పార్వ‌తి ఫోటోల్ని చింద‌ర‌వంద‌ర‌గా విసిరేశార‌ట‌. ఆ ఎపిసోడ్‌ ని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కి ఆర్జీవీ జ‌త చేసి వేడి పెంచుతున్నార‌ని తెలుస్తోంది. అంటే ఆ ఒక్క ఎపిసోడ్‌ తో అగ్గి రాజేయ‌డం ద్వారా త‌న సినిమా మార్కెట్‌ ని పెంచుకోవాల‌న్న వ్యూహం క‌నిపిస్తోందా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే వ‌ర్మ‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కోటింగ్ త‌ప్ప‌ద‌న్న మాటా వినిపిస్తోంది. ఇక వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి అన్ని ఎపిసోడ్ల‌ను త‌న కోణంలో చెప్పింది ల‌క్ష్మీ పార్వ‌తినే. ఆ ఎపిసోడ్‌ కి సంబంధించి త‌నే ఉప్పందించి ఉండాలి.