ఎన్టీఆర్ కు మరోసారి కొడుకు పుట్టాడు

Thu Jun 14 2018 13:53:22 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ ఆశలు అడియాశలయ్యాయి. ఈసారి తనకు ఆడపిల్లే పుడుతుందని.. పుడితే తన నాయనమ్మ బసవతారం పేరు పెడతాను అన్న ఎన్టీఆర్ కు ఆ ఆశ తీరలేదు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి వరుసగా రెండో సారి మగబిడ్డకే జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఎన్టీఆర్ తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘నా ఫ్యామిలీ మరింత పెద్దది అయ్యింది.. నాకు బాబు పుట్టాడు’ అని ట్వీట్ చేశాడు.  జూనియర్ ఎన్టీఆర్ - ప్రణతి దంపతులకు మళ్లీ కుమారుడే జన్మించాడనే  వార్త అప్పుడే వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి పోయింది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ కు కొడుకు అంటూ తెగ షేర్ చేస్తున్నారు.
 
ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతికి ఈ రోజు ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మధ్యాహ్నం  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఆరోగ్యం గా ఉన్నట్టు సమాచారం.  ఈ వార్త తెలిశాక ఆయన అభిమానులు -  తెలుగు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ అంటూ ఎన్టీఆర్ కు అభినందనలు పంపుతున్నారు. టాలీవుడ్ పెద్దల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.