జూనియర్ ఎన్టీఆర్.. మళ్లీ నాన్న!

Sun Feb 18 2018 11:16:39 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నాడు. తారక్-ప్రణతి దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. నిన్న రాత్రి నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ కు అభయ్ రామ్ అనే కొడుకున్న సంగతి తెలిసిందే. 2015లో అభయ్ జన్మించాడు. మూడేళ్ల విరామం తర్వాత రెండో సంతానానికి జన్మనివ్వబోతోంది ప్రణతి.ప్రణతికి ఇప్పుడు ఎన్నో నెల.. ప్రసవం ఎప్పుడు అనేది వెల్లడి కాలేదు. తాను మళ్లీ తండ్రి కాబోతున్న విషయాన్ని ఎన్టీఆర్ గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం బయటికి వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ త్వరలోనే ఈ సంగతిని అభిమానులతో అధికారికంగా పంచుకోబోతున్నట్లు సమాచారం.

అభయ్ రామ్ వచ్చాక తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని.. ఎంతో పరిణతి సాధించానని ఎన్టీఆర్ చెబుతుంటాడు. కొడుకు వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ గొప్పగా సాగుతుండటం విశేషం. గత మూడేళ్లలో నటుడిగా గొప్ప పేరు సంపాదించడమే కాక.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు తారక్. ఈ మూడేళ్లలో అతడి మార్కెట్ దాదాపుగా రెట్టింపయింది. గత ఏడాది ‘జై లవకుశ’తో పలకరించిన తారక్.. త్వరలోనే త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నాడు.