హీరోయిన్లకు ఎప్పుడూ ఇవే ప్రశ్నలా!!

Thu Oct 19 2017 23:00:01 GMT+0530 (IST)

ఇప్పుడు హీరోయిన్ కనిపిస్తే మనోళ్లు ఏమని అడుగుతారు? అదేనండీ.. మీడియాలో ఎక్కువగా హీరోయిన్లను ఏం అడుగుతారు? అలాంటి ప్రశ్నలను చూస్తే మాత్రం కాస్త నవ్వొస్తుంది. అదే విషయం ఇప్పుడు హీరోయిన్లే చెబుతున్నారు.విషయం ఏంటంటే.. అసలు ఎవరైనా కొత్తగా ఒక భామ ఇంప్రెస్ చేసినప్పుడు.. నువ్వు తదుపరి ఎలాంటి సినిమాలు చేయబోతున్నావు అని అడిగి సరిపెట్టకుండా.. నువ్వు తరువాత సినిమాలో మహేష్ తో చేస్తావా ప్రభాస్ తో చేస్తావా అంటూ మనోళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారట. ఇదే విషయం కొందరు ఫెమినిస్టులను మరియు హీరోయిన్లను బాధిస్తోంది. ఎందుకంటే కొత్తగా హిట్టు కొట్టిన హీరో దగ్గరకు వెళ్లి.. నువ్వు తదుపరి ఏ హీరోయిన్ తో చేస్తావు అని అడగరు కాని.. హీరోయిన్లను మాత్రం ఎందుకు అలా అడుగుతున్నారు అంటున్నారు వారు.

ఏదేమైనా కూడా.. హీరోయిన్లను అడిగే ప్రశ్నలు మార్చాలి అనేది చాలామంది ఉవాచ. మరి మనోళ్ళు నీ ఫేవరేట్ హీరో ఎవరు ఎవరితో చేస్తావ్ అని కాకుండా.. ఇంకేమైనా పనికొచ్చే ప్రశ్నలు అడుగుతారేమో చూద్దాం.