Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డిలో కొత్త కోణాన్ని చూపించారు

By:  Tupaki Desk   |   16 April 2018 10:21 AM GMT
శ్రీ‌రెడ్డిలో కొత్త కోణాన్ని చూపించారు
X
గ‌డిచిన రెండు వారాలుగా సినీన‌టి శ్రీ‌రెడ్డి అలియాస్ శ్రీ‌శ‌క్తి వ్య‌వ‌హారం టీవీ ఛాన‌ళ్ల‌తోపాటు.. తెలుగు ఇండ‌స్ట్రీని ఒక ఊపు ఊపుతోంది. క్యాస్టింగ్ కౌచ్ మీద గ‌ళం విప్పిన ఆమెకు ఇప్పుడు తోడుగా ప‌లువురు ముందుకు రావ‌టం ఒక ఎత్తు అయితే.. సినీ ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌ల‌పై విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణలు ఒక్కొక్క‌టిగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. శ్రీ‌రెడ్డిపై తాజాగా ఒక విమ‌ర్శ ఫేస్ బుక్ లో పోస్ట్ అయ్యింది. మ‌హిళా జ‌ర్న‌లిస్టుగా పేరున్న ఒక మ‌హిళ శ్రీ‌రెడ్డి తీరును కొత్త‌త‌ర‌హాలో ప్ర‌శ్నించారు. శ్రీ‌రెడ్డికి సంబంధించి ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. శ్రీ‌రెడ్డికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న వారు ఒక్క‌సారి త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకునేలా చేశారు త‌న తాజా పోస్ట్ తో. త‌న వాద‌న‌తో పాటు.. అందుకు త‌గ్గ‌ట్లు శ్రీ‌రెడ్డికి సంబంధించిన రెండు వీడియోల‌ను ఆమె పోస్ట్ చేశారు.

రూపా వాణి కోనేరు పేరుతో ఉన్న ఈ అకౌంట్ లో ఆమె పెట్టిన అభిప్రాయాన్ని య‌థాత‌ధంగా చూస్తే..

"శ్రీరెడ్డి. ఆడవాళ్లపై అవకాశాల మాటున జరుగుతోన్న లైంగిక దోపిడీపై గళమెత్తి శ్రీశక్తిగా మారిన యువతి. కాస్టింగ్ కౌచ్ పై సంచలన విషయాలు రుజువులతో సహా బయటపెట్టి మొత్తం తెలుగు చిత్రసీమను ఒక కుదుపు కుదిపింది. 50లక్షల పైచిలకు ఫాలోవర్స్ తో ఫేస్ బుక్ సర్టిఫికేషన్ తెచ్చుకున్న శ్రీరెడ్డిమీద అదే సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అసలు కోణాలపై ఇప్పుడు హాట్.. హాట్ డిస్కషన్ నడుస్తోంది"

"శ్రీరెడ్డి అమాయ‌కురాలు నిజ‌మే మోసం చేశారు. ప‌చ్చిగా చెప్పాలంటే వాడుకొని వ‌దిలేశారు. ఈ వీడియో చూశాక ఆమె ఎంత అమాయ‌కురాలో.. సినిమా ఇండ‌స్ట్రీ ఎంత ప‌చ్చిగా విచ్చ‌ల‌విడిగా.. ఏమీ తెలియ‌ని అమాయ‌కురాలిని ఎంత వాడుకున్నారో.. ఆడుకున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌న‌ప‌డుతోంది. మ‌హిళా సాధికార‌త మ‌నం ఎలా అయినా స్వేచ్ఛ‌గా బ‌తికే హ‌క్కునిచ్చింది. ఇదేనా ఆ హ‌క్కు?"

"14 సంవ‌త్స‌రాల నా జ‌ర్న‌లిజంలో మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను ఆవిష్క‌రిస్తూ.. మీ అంద‌రితో చ‌ర్చ‌లు పెట‌టి.. ఎండ‌లో వాన‌లో తిరిగి రిపోర్టులు రాసి మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడిన అనుభ‌వంలో నా మ‌స్తిష్కంలో ఒకటే ప్ర‌శ్న తొలుస్తోంది. మ‌హిళా సంఘాల అక్క‌య్య‌లూ ఇదేనా మ‌నం కోరుకున్న స్వేచ్ఛ‌.. ఇదేనా మ‌నం కోరుకున్న‌..చ‌ర్చించుకున్న సాధికార‌త‌..?"

"మ‌హిళ‌లుగా మ‌న‌కి ఇలా అంటే.. ఈ వీడియోలో శ్రీ‌రెడ్డి మాట్లాడిన‌ట్లుగా మాట్లాడే హ‌క్కుంది. మ‌నం ఇలాంటివాళ్ల‌ని స‌మ‌ర్థిస్తాం.. పోరాడ‌తాం. చూసిన మ‌గాడు మాత్రం మ‌న‌ల్ని ముట్టుకోకూడ‌దు. మ‌డిక‌ట్టుకోవాలి. వాళ్ల‌ని చీల్చి చెండాడ‌తాం. మ‌న‌కే హార్మోన్లు ఉన్నాయ్.. మ‌గాడికి లేవు మ‌రి.."

"పోరాటం అంటే పార‌ద‌ర్శ‌క‌త‌.. అక్క‌డ లింగ‌బేధాలు.. రాగ‌ద్వేషాలు.. స్వార్థ‌ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు. ఉండ‌కూడ‌దు. ఇండ‌స్ట్రీలో కామ‌పిశాచుల‌పైన కొర‌డా ఎంత అవ‌స‌ర‌మో.. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం అడ్డ‌దారిలో కంచె దాటాల‌నుకునే లేడి పిల్ల‌ల‌కు మార్గ‌నిర్దేశ‌కాలు.. చ‌ట్టాలూ అవ‌స‌రం"

వీడియో కోసం క్లిక్ చేయండి

మరొక వీడియో కోసం క్లిక్ చేయండి