Begin typing your search above and press return to search.

నాగబాబుకి వార్నింగ్... జానీ మాస్టర్ షాక్!

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:29 AM GMT
నాగబాబుకి వార్నింగ్... జానీ మాస్టర్ షాక్!
X
మెగాస్టార్ "బాస్ ఈజ్ బ్యాక్" 150 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుంది, ఎంత సందడి ఉత్సాహం అభిమానులకు తీసుకొచ్చింది అనే సంగతులు కాసేపు అలా ఉంచితే... ఈ కార్యక్రమం అనంతరం నాగబాబు మీడియాలో హాట్ టాపిక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై నాగబాబు తనదైన స్పీచ్ తో యండమూరి వీరేంద్రనాథ్, రాం గోపాల్ వర్మ లపై ఫైరవడం.. ఈ వ్యాఖ్యలపై యండమూరి తనదైన శైలిలో స్పందించడం జరిగిపోయాయి. అనంతరం ఆ రోజు నుంచి రాం గోపాల్ వర్మ నాగబాబుపై ట్విట్టర్ వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ట్విట్ల దండకం విషయంలో ఇప్పటికే వర్మ పీక్స్ కి వెళ్లిపోయినా, నాగబాబు మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే!! ఆ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఒక టీవీ షో లైవ్ లో నాగబాబు ప్రస్థావన తీసుకొచ్చిన ఒక ఎన్నారై, ఎన్.బీ. ని ఏకిపారేసినంత పనిచేశారు!

తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ లో నిర్వహించిన ప్రవాస భారతీయుల లైవ్ షోలో చిరంజీవి 150 చిత్రానికి పనిచేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారై అభిమానులతో ఆ సినిమా విషయాలను, చిరంజీవితో స్టెప్పులేయించిన అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో కాల్ చేసిన ఒక ప్రవాసుడు జానీ మాస్టర్ సంగతులు పక్కనపెట్టి నాగబాబు ప్రస్థావన తీసుకొచ్చారు. మెగాస్టార్ కు చిన్న విజ్ఞప్తి, దయచేసి మీరేమీ అనుకోవద్దు అంటూ మొదలుపెట్టిన ఆ ఎన్నారై... ఇకపై మెగాస్టార్ పంక్షన్స్ కి నాగబాబుని దూరం పెట్టమని రిక్వస్ట్ చేశాడు.

ఆ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడిన బాష చాలా చండాలంగా ఉందని, తన అభిప్రాయాన్ని తప్పుగా అనుకోవద్దని, యండమూరి ని కూడా చాలా దారుణంగా మాట్లాడారని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, విమర్శలను స్వీకరించి కష్టపడి ఆ కామెంట్స్ కి సమాధానం చెపాలి కానీ నోటి మాటలతో కాదని ఆ ప్రవాస భారతీయుడు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఏమి మాట్లాడాలో ఎలా స్పందించాలో అర్ధం కాలేదో ఏమో కానీ... ఆ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన జానీ మాస్టర్ మాత్రం షాకై చూస్తుండిపోయారు!! అనంతరం.. ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయ్యొద్దని, జానీ మాస్టర్ తో మాత్రమే మాట్లాడాలని ఆ యాంకర్ సూచించడం జరిగింది!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/