Begin typing your search above and press return to search.

ఛ.. మథర్ ఆఫ్ ఆల్ యాక్షన్ మూవీ?

By:  Tupaki Desk   |   21 May 2018 11:30 PM GMT
ఛ.. మథర్ ఆఫ్ ఆల్ యాక్షన్ మూవీ?
X
బాలీవుడ్ లో వరుసగా ఓ నాలుగైదు డిజాస్టర్స్ అందితే ఆ హీరోల కెరీర్ దాదాపు ముసగినట్లే. ఎంతో మంది స్టార్ హీరోలు వరుస డిజాస్టర్స్ తరువాత సైడ్ క్యారెక్టర్స్ చేసినా కూడా బాలీవుడ్ జనాలు మొహం కూడా చూడరు. నచ్చనప్పుడే కెరీర్ కి పులిస్టాప్ పెట్టాలి. లేకుంటే సెట్ అయ్యే పాత్ర వచ్చే సరికి ఎదురుచూడాలి. కానీ ఓ నటుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు సినిమాల్లో నటిస్తూ జనాలకు నచ్చుతుందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా రొటీన్ సినిమాలను వదిలేస్తున్నాడు.

ఎదో అమ్మాయి అన్నట్టు సెమి న్యూడ్ తో ఫొటోలు ఇవ్వడం అతనికి బాగా అలవాటు. అతను ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. జిస్మ్ సినిమాతో రొమాంటిక్ బాయ్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరో జాన్ అబ్రహం. కెరీర్ మొదలైనప్పటి నుంచి హిట్స్ ఎన్ని అందుకున్నాడో గాని అతని కెరీర్ లో డిజాస్టార్సే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిపై పెద్దగా అంచనాలు కూడా లేవు.

ఇక త్వరలోనే ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడట. అదెలా ఉంటుందని అంటే మథర్ ఆఫ్ ఆల్ యాక్షన్ మూవీస్ అని చెబుతున్నాడు. అసలు సరిగ్గా సోలో హిట్ లేని హీరోకి ఇలాంటి ఆఫర్స్ ఎలా అందుతున్నాయో?. బిజినెస్ ఫ్యామిలీ కావడంతో ఇక కొన్ని సినిమాలకు అయితే తనే డబ్బులు కుమ్మరిస్తాడు. ఇప్పటివరకు పెద్దగా హిట్స్ లేని ఈ మహానుభావుడు నెక్స్ట్ అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.