Begin typing your search above and press return to search.

బికినీ మహిమతో మరో సినిమా

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:30 AM GMT
బికినీ మహిమతో మరో సినిమా
X
చూస్తే చిరునవ్వుతోనే చంపేసి చిన్నది ఎవరంటే తాప్సి అనే చెప్పాలి. సొట్టబుగ్గలతో సిగ్గుపడుతూ.. సోయగాలను వెండి తెరపై అరబోసి ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసే తాప్సికి ఎంత కష్టపడినా ఛాన్సులు మాత్రం అంత పెద్దగా రావడం లేదు. దీంతో ఈ అమ్మడు రూటు మార్చేసింది. రీసెంట్ గా జుడ్వా2 అనే బాలీవుడ్ సినిమా ట్రైలర్ లో తాప్సి ఎప్పుడు కనిపించనంతగా కనిపించి షాక్ కి గురి చేసింది. సాధారణంగా చూస్తేనే తాప్సి సెక్సీ అందాలు వర్ణనాతీతం. ఇక అలాంటి చిన్నది బికినీ లో కనిపించి గుండెను పట్టుకునేలా చేసింది. అంతే కాకుండా ఆ సినిమాలో వరుణ్ ధావన్ తో లిప్ లాక్ చేసి కాస్త ఘాటుగానే కనిపించింది.

అయితే ఆ చిత్రం ట్రైలర్ మహిమ ఏమో గాని తాప్సికి కి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం తన నెక్స్ట్ సినిమాలో తాప్సి అందాలకి ఫిదా అయిపోయి ఆమెను ఫిక్స్ చేశాడని టాక్ వినిపిస్తోంది. గత ఏడాది స్పానిష్ లో వచ్చిన 'ది ఇన్ విజిబుల్ గెస్ట్' అనే సినిమాను బాలీవుడ్‌ లో రీమేక్ చేయడానికి జాన్ డిసైడ్ అయ్యాడట. ఒక బిజినెస్ మెన్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత అతను ఆమె వల్ల ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఉండబోతోందట. ఇక తాప్సి హీరోకి గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఛాన్స్ కొట్టేయనుందని బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. చూద్దాం తాప్సి బికినీ ఇంకా ఎన్ని చాన్సులు తెచ్చిపెడుతుందో.