Begin typing your search above and press return to search.

ఉత్త‌మ న‌టులు... ఎన్టీఆర్ - బ‌న్నీ!

By:  Tupaki Desk   |   18 Jun 2017 5:58 AM GMT
ఉత్త‌మ న‌టులు...  ఎన్టీఆర్ - బ‌న్నీ!
X
ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 64వ ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాల్లో ఎన్టీఆర్‌ - అల్లు అర్జున్ మెరిశారు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో న‌ట‌న‌కిగానూ ఎన్టీఆర్ ఉత్త‌మ న‌టుడుగా బ్లాక్ లేడీని అందుకోగా, బ‌న్నీ క్రిటిక్స్ జ్యూరీ విభాగంలో స‌రైనోడుకిగానూ ఉత్త‌మ న‌టుడుగా నిలిచారు. ఇద్ద‌రు యువ అగ్ర క‌థానాయ‌కులు వేదిక‌నెక్కి బ్లాక్ లేడీని అందుకోవ‌డంతో శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌ లోని హెచ్‌.ఐ.సీ.సీలో జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కార వేడుక‌లో సంద‌డి క‌నిపించింది. ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌ లో ఉన్నాడిప్పుడు. అందుకే విజ‌యాల‌తో పాటు, పుర‌స్కారాలు కూడా ల‌భిస్తున్నాయి. ఇప్ప‌టికే మా అవార్డ్స్‌తో పాటు, సైమాలోనూ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం చేజిక్కించుకొన్న ఆయ‌న తాజాగా ఫిలింఫేర్‌ ని కూడా సొంతం చేసుకొన్నాడు.

దాంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎన్టీఆర్ కు ఇది రెండో ఫిలింఫేర్ పుర‌స్కారం కావ‌డం విశేషం. 2007లో యమదొంగ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో బ్లాక్ లేడీని అందుకొన్నాడు. మళ్లీ 10ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ను ఈ అవార్డ్ వరించింది. ఎన్టీఆర్‌ లాగే వ‌రుస‌గా విజ‌యాలు సొంతం చేసుకొంటున్న మ‌రో యువ క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ కూడా ఈసారి ఉత్త‌మ న‌టుడిగా బ్లాక్‌ లేడీని (క్రిటిక్స్ జ్యూరీ విభాగంలో) అందుకొన్నాడు. ఉత్త‌మ న‌టిగా అఆలో న‌ట‌న‌కిగానూ స‌మంతకి పుర‌స్కారం ద‌క్కింది. క్రిటిక్స్ విభాగంలో ఉత్త‌మ న‌టిగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూవ‌ర్మ ఎంపికైంది. త‌మిళం - తెలుగు భాష‌ల్లో మంచి గుర్తింపు పొందిన క‌థానాయ‌కుడు కార్తీ ఎన్టీఆర్‌ - స‌మంత‌ల‌కి ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాన్ని అంద‌జేశాడు. అల్లు అర్జున్‌ కి వెంక‌టేష్ బ్లాక్ లేడీని అందించాడు. ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమా స‌త్తా చాటుతూ మొత్తం 3 పుర‌స్కారాల్ని సొంతం చేసుకొంది. పెళ్లి చూపులు - అఆ - ఊపిరి - జ‌న‌తాగ్యారేజ్ చిత్రాలు రెండ్రెండు చొప్పున పుర‌స్కారాలు సొంతం చేసుకొన్నాయి. ప్ర‌ముఖ న‌టి - ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌లకి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేశారు. ఇంకా ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాల్లో పుర‌స్కారాలు అందుకొన్న న‌టీన‌టులు - సాంకేతిక నిపుణుల జాబితా ఇలా ఉంది...

ఉత్త‌మ చిత్రం: పెళ్ళిచూపులు

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: వ‌ంశీ పైడిప‌ల్లి (ఊపిరి)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు: దేవిశ్రీప్ర‌సాద్ (నాన్న‌కు ప్రేమ‌తో)

ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం: పి.ఎస్‌.వినోద్ (ఊపిరి)

ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ : శేఖ‌ర్ మాస్ట‌ర్ (యాపిల్ బ్యూటీ - జ‌న‌తా గ్యారేజ్‌)

ఉత్త‌మ లిరిసిస్ట్: రామ‌జోగ‌య్య‌శాస్త్రి (ప్ర‌ణామం, జ‌న‌తా గ్యారేజ్‌)

ఉత్త‌మ స‌పోర్టింగ్ రోల్: జ‌గ‌ప‌తిబాబు (నాన్న‌కు ప్రేమ‌తో)

ఉత్త‌మ స‌పోర్టింగ్ రోల్ ఫిమేల్: న‌ందిత శ్వేత (ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా)

ఉత్త‌మ ప్లేబ్యాక్ సింగ‌ర్: కార్తీక్ (అఆ - వెళ్లిపోకే)

ఉత్త‌మ ప్లేబ్యాక్ సింగ‌ర్ ఫిమేల్: చిత్ర (నేను శైల‌జ‌ - ఈ ప్రేమ‌కి)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/