బ్యాక్ ఫ్లిప్ చేస్తున్న హాట్ బ్యూటీ

Tue Feb 12 2019 14:18:44 GMT+0530 (IST)

ఈ జెనరేషన్ హీరోయిన్లందరూ దాదాపుగా ఫిట్నెస్ ఫ్రీక్సే. అసలే వారుండేది గ్లామర్ ఇండస్ట్రీలో కాబట్టి ఫిట్ గా.. స్లిమ్ గా లేకపోతే పోటీలో తట్టుకోవడం కష్టం.  బ్యూటిఫుల్ పూజా హెగ్డే కూడా ఈ సూత్రాన్ని ఒంటబట్టించుకొని తరచుగా ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్నెస్ ను గ్లామర్ ను మెయిన్టెయిన్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది.  అప్పుడప్పుడూ ఈ కసరత్తుల వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా అలాంటి ఒక ఎక్సర్ సైజ్ వీడియోనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఈ వీడియోను ఇక్కడ పోస్ట్ చేసేందుకు అర్హమైనదే." ఇంతకీ వీడియోలో పూజ ఏం చేస్తోందంటే.. వెనకకు ఒంటిని విల్లులా వంచింది. ఈ మాట చెప్పినంత సులువు కాదు.  ఈ ఉల్టాపల్టా పోజు ఇవ్వాలంటే శరీరంలో కాస్త ఈజ్.. ఫ్లెక్సిబిలిటీ తో పాటుగా అలవాటు కూడా ఉండాలి.  అలా కాకుండా బ్యూటీ వంచింది కదా అని మనమూ వంచితే.. మూవ్.. వోలిని.. వోలిట్రా.. గట్రా మందుల అవసరం పడుతుంది. తస్మాత్ జాగ్రత్త!

ఈ కఠిన కసరత్తుల విషయం పక్కనబెడితే ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబు 'మహర్షి' లోనూ.. #ప్రభాస్20 లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. రెండూ క్రేజీ ప్రాజెక్టులు కాబట్టి పూజ తన కెరీర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రెండు సినిమాల్లో ఒకటి హిట్ అయినా స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ళు టాలీవుడ్ లో పాగా వేస్తుందనే ఆంచనాలు ఉన్నాయి.