Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురు నడుముతో ఆ కుర్రాడు..

By:  Tupaki Desk   |   18 Feb 2017 1:01 PM GMT
శ్రీదేవి కూతురు నడుముతో ఆ కుర్రాడు..
X
అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్.. హీరోయిన్ అరంగేట్రానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తప్ప.. ఇప్పటికే అన్ని ప్రిపేర్ అయిపోయాయని టాక్. అలాగే ఆన్ లైన్ లోనూ.. పర్సనల్ వ్యవహారాల్లోనూ జాన్వి ఎప్పుడూ ట్రెండింగ్ గానే ఉంటుంది.

త్వరలో కరణ్ జోహార్ మూవీతో తెరంగేట్రం చేయనున్న జాన్వి.. సోషల్ మీడియాలో మహా యాక్టివ్. సెన్సేషన్ సృష్టించే ఫోటోలను షేర్ చేసేందుకు ఏ మాత్రం ఆలోచించదు. తాజాగా ఓ మూడు సెకన్ల వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది జాన్వి. ఇందులో జాన్వి కపూర్ నడుం ఊపుతూ డ్యాన్స్ చేస్తుంటే.. ఆమె నడుుము దగ్గరకు చేరి చప్పట్లు కొడుతూ హుషారు ఇస్తున్న ఆమె బాయ్ ఫ్రెండ్ అక్షత్ కనిపిస్తాడు. అటు నడుం ఊపుతూ వేసే స్టెప్ ఎంతగా జనాలకు నచ్చేసిందో.. ఆమెకు అంత క్లోజ్ గా ఆ కుర్రాడు ఉండడం అంతగా ఆశ్చర్యం కలిగించింది.

ఈ అక్షత్ రంజన్ తో జాన్వి కపూర్ రిలేషన్ బాగా స్ట్రాంగ్ గా నడుస్తోందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. అందుకు తగ్గట్లుగానే మొత్తం శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మధ్య ఓ ఫోటోలో కనిపించాడు అక్షత్ రంజన్. ఇక జాన్వి స్టైలింగ్ విషయంలో ఈ మధ్య శ్రీదేవి బాగా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే అమ్మడి లుక్స్ లో విపరీతమైన మార్పులు కనిపించేస్తున్నాయనే టాక్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/