Begin typing your search above and press return to search.

పాటతోనే ప్రేమలో పడేసారు

By:  Tupaki Desk   |   20 Jun 2018 11:53 AM GMT
పాటతోనే ప్రేమలో పడేసారు
X
అందాల తార స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ తెరంగేట్రం చేస్తున్న ధడక్ ఆల్బంలోని మొదటి పాట ఆన్ లైన్ లో విడుదలైన కాసేపటికే మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ గా మారిపోతోంది. కూల్ మెలోడీతో టైటిల్ సాంగ్ గా ట్యూన్ చేసిన ఈ పాట శ్రేయ ఘోషల్ స్వీట్ వాయిస్ తో మళ్ళి మళ్ళి వినాలనిపించేదిగా ఉండగా అంతకు మించి పాటలో చూపించిన విజువల్స్ ఇషాన్ జాన్వీల మధ్య కుదిరిన అద్భుతమైన కెమిస్ట్రీ వెరసి జులై 20న విడుదల కానున్న సినిమాకు శుభ సూచకంగా మార్చేశాయి.

సౌత్ లాగా బాలీవుడ్ లో లిరికల్ వీడియోస్ ఉండవు. మొత్తం వీడియోనే వదులుతారు. ఆ క్రమంలో వచ్చిన దఢక్ ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ అనిపించుకుంది. మరాఠి ఒరిజినల్ వెర్షన్ సైరాట్ కు సంగీతం అందించిన అజయ్-అతుల్ తమ మీద నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. తన సినిమాల మ్యూజిక్ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కరణ్ జోహార్ ఇందులో కూడా తన టేస్ట్ చూపించేసాడు. పాట సంగతి అలా ఉంచితే జాన్వీ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.మొహంలో ఫ్రెష్ నెస్ తొణికిసలాగుతుండగా ఇషాన్ తో ప్రేమ సన్నివేశాల్లో ఒదిగిపోయిన తీరు చూస్తుంటే తల్లికి తగ్గ కూతురు అనిపించేలా ఉంది.

నాన్న జీపులో కలిసి వెళ్తుండగా వెనుక ఇషాన్ తరుముతూ ఉంటే వెళ్ళమని వారించే సీన్ లో నాట్యం నేర్చుకుంటూ ఇషాన్ చూపులను తప్పించుకునేటప్పుడు ఇచ్చే ఎక్స్ ప్రెషన్ లో మొత్తం జాన్వీ డామినేషన్ కనిపించింది. స్థానిక రాజకీయ నాయకుడి కూతురిగా జాన్వీ వెనుకబడిన వర్గానికి చెందిన స్టూడెంట్ గా ఇషాన్ మధ్య ప్రేమ కథ ఇతివృత్తంగా రూపొందిన దఢక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పాట మొత్తం చూసాక ఎక్కడో మనసులో తన కూతురి మొదటి సినిమా చూసే అవకాశాన్ని నెలల వ్యవధిలో వదులుకున్న శ్రీదేవిని తలుచుకుంటే ఎక్కడో గుండెలో కాస్త బరువుగా అనిపించడం ఖాయం.