తిరుమలలో జాన్వీ.. గుర్తు పట్టని జనాలు

Tue Jan 01 2019 17:47:27 GMT+0530 (IST)

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాజాగా తన తండ్రి బోణీ కపూర్ మరియు సోదరి ఖుషీ కపూర్ లతో కలిసి తిరుమల వెంకటేశుని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె చాలా సింపుల్ గా చీరలో గుడికి వెళ్లారట. దాంతో ఆమెను ఎవరు గుర్తు పట్టలేక పోయారు. శ్రీదేవి కూతురు అంటూ ఒకరు ఇద్దరు అనుకున్నారట తప్ప జాన్వీని చూసి ఎక్కువ శాతం గుర్తు పట్టలేదట. ఆమె పక్కన బోణీ కపూర్ ఉండటం వల్ల జాన్వీని కొందరు గుర్తు పట్టారట.సింపుల్ చీర కట్టులో అచ్చు శ్రీదేవిలా అనిపించింది. శ్రీదేవి బతికి ఉన్న సమయంలో ఎక్కువగా తిరుమల వచ్చే వారు. ఆమె దారిలోనే ఆమె భర్త మరియు పిల్లలు కూడా ఆమె లేకున్నా కూడా తిరుమల వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కొత్త సంవత్సరంలో వెంకటేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తల్లి వారసత్వంను నిలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

గత ఏడాదిలో ‘ధడక్’ చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా కూడా జాన్వీకి మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం జాన్వీ రెండు సినిమాలు చేస్తోంది. మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. జాన్వీ కపూర్ తో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యే అవకాశం ఉంది.