జాన్వి... బయట కూడా అంతేనా!?

Thu Apr 19 2018 16:06:04 GMT+0530 (IST)

అతిలోక సుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వి కపూర్... త్వరలో బాలీవుడ్ లో తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా లోకేషన్ నుంచి  వచ్చిన స్టిల్స్ చూసి ఈ పిల్ల అచ్చం శ్రీదేవిలాగే ఉందంటూ అనుకున్నారంతా. తాజాగా ఈ ‘దఢక్’ భామ మేకప్ లేకుండా బయటికి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్లకి ఫోజులిచ్చిన ఈ సుందరి... తన అందంతో అందరినీ తన వైపు తిప్పేసుకుంది.ముంబైలోని డిజైనర్ స్టోర్ బంద్రాకి వెళ్లింది జాన్వి కపూర్.  తెల్లని టీ షర్ట్ ... ఆరెంజ్ కలర్ షార్ట్ వేసుకుని యమా హాట్ గా కనిపిస్తూ... తోడల అందాన్ని స్వేచ్ఛగా వదిలేసింది జాన్వి కపూర్. ఒక చేతిలో పర్సు... మరో చేతిలో ఫోను పట్టుకుని ముద్దుగానూ కనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా బయటికొచ్చేటప్పుడైనా కాస్త పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చుగా అని కొందరు అంటుంటే... మేకప్ లేకున్నా కూడా జన్వి ఎంత అందంగా ఉందో అంటూ ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు. జాన్వి కపూర్ పక్కనే ఆమె పిన్ని- శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి కూడా ఉంది. శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత అక్క పిల్లల సంరక్షణ బాధ్యతను మహేశ్వరే చూసుకుంటున్నట్టు అర్థమవుతోంది.

జాన్వి కపూర్ తొలిచిత్రం ‘దఢక్’ సినిమాలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘సైరత్’ సినిమా రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 20న విడుదల కాబోతోంది.