Begin typing your search above and press return to search.

చిట్టి చిలక‌మ్మ‌ గోరింక ఎవ‌ర‌మ్మా

By:  Tupaki Desk   |   16 Nov 2018 1:30 AM GMT
చిట్టి చిలక‌మ్మ‌ గోరింక ఎవ‌ర‌మ్మా
X
అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణీ...

ఆ దేవుడు ఆ దేవితో అలక బూనెనేమో..ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో
మోహనాల సోయగాల మేనకో.. మరి దేవలోక పారిజాత మాలికో...

ఈ పాట‌లో మహానుభావుడు వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి యాథృచ్ఛికంగా రాశాడో లేక శ్రీ‌దేవి అందాల‌కు ముగ్దుడై రాశాడో కానీ - అందాల మీనా (చంటి సినిమా)ను శ్రీ‌దేవితో పోల్చి ప‌ద‌జాలం సృజించాడు. ఇప్పుడు శ్రీ‌దేవి కుమార్తెను చూస్తే ఇంకెవ‌రితో పోలిక పెట్టేవాడో? మొత్తానికి శ్రీ‌దేవి - వేటూరి స్వ‌ర్గ‌లోక విహారులయ్యారు. ఇహ‌లోకంలో శ్రీ‌దేవి వార‌సురాలిగా జాన్వీ ఇప్ప‌టికే గేమ్ స్టార్ట్ చేసింది. తొలి పాచిక `ధ‌డ‌క్` ఫ‌ర్వాలేదు. మ‌లి ప్ర‌య‌త్నం భారీ హిస్టారిక‌ల్ సినిమాలోనే న‌టిస్తోంది. మ‌రోవైపు జాన్వీ లైన‌ప్‌ని బిగ్ రేంజులో ఉండేలా - ఇండ‌స్ట్రీ బెస్ట్ హీరోల్ని బోనీ క‌పూర్ లైన్‌ లో పెడుతున్నాడ‌న్న మాటా వినిపిస్తోంది. క‌ర‌ణ్ జోహార్ ఇచ్చిన టిప్స్ తో ముంబై వీధుల్లో ధ‌డ పుట్టిస్తోంది ఈ స్టార్ కిడ్. జిమ్ము - క్ల‌బ్బు - ప‌బ్బు కాదేదీ ఫ్యాష‌న్ క‌న‌ర్హం అన్న చందంగా జాన్వీ ప్ర‌తాపం చూపిస్తోంది. ఎంబ్రాయిడ‌రీ మ‌గ్గం వ‌ర్క్‌ తో డిజైన్ చేసిన స్పెష‌ల్ డిజైన‌ర్ వేర్ లో జ‌పనీ బొమ్మ‌లా ఎలా తీరిగ్గా కుదురుకుందో! మీన నేత్రాల‌తో గుండెకు గాలం వేస్తోంది. గోరింక కోసం వేచి చూస్తున్న చిల‌క‌మ్మ‌లా.. !!!