వీడియో: జాన్వీ బెల్లీ డ్యాన్స్ ఐఫీస్ట్

Sun Jun 16 2019 23:21:32 GMT+0530 (IST)

నటవారసుల్లో జాన్వీ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి ప్రయత్నమే ఆకట్టుకుంది. ధడక్ లో జాన్వీ నటనకు ప్రశంసలు దక్కాయి. అటుపై కెరీర్ పరంగా వెనుదిరిగి చూసే పనే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటిస్తున్న జాన్వీ తదుపరి `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటించనుంది. వేరొక హారర్ కామెడీకి సంతకం చేసింది.సినిమాల పరంగా పూర్తి బిజీగా ఉంటూనే .. ముంబైలో ఏ ఈవెంట్ జరిగినా క్యాట్ వాక్ లు చేస్తూ జాన్వీ క్షణం తీరిక లేకుండా ఉంటోంది. ఇక రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా జిమ్ కి వెళుతూ సందడి చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ స్పోర్ట్స్ డ్రెస్ లతో యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఫిజికల్  ఫిట్ నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది.

తాజాగా జాన్వీ డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో బిజీగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఈ బ్యూటీ పాశ్చాత్య నృత్యాల్లోనూ రాటు దేలుతోందని ఈ వీడియోలు చెబుతున్నాయి. లేటెస్టుగా బెల్లీ డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో నడుము ఊపులను ఎంతో అలవోకగా ప్రదర్శిస్తూ జాన్వీ అదరగొట్టేస్తోంది. ఇక డ్యాన్సుల్లో మామ్ శ్రీదేవి అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంటుందనే అర్థమవుతోంది. జాన్వీ బెల్లీ డ్యాన్స్ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా దూసుకుపోతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి