ఈ ప్రేమ కథ పోస్టర్ బావుందే

Wed Jun 13 2018 18:47:05 GMT+0530 (IST)

మొదటి సినిమానే సరిగ్గా ఆడకపోతే ప్రేక్షకులలో మంచి పేరు సాధించడం కొంచెం కష్టం. అందుకే మొదటి సినిమాపైన చాలా దృష్టి పెడతారు. కానీ ఒక రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అంటే కొంచెం రిస్కీనే. ఎందుకంటే కథ అప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి మరింత యాక్టింగ్ డైరెక్షన్ ఇతరత్రా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఒక రిస్క్ చేస్తున్నారు ఇద్దరు స్టార్ కిడ్స్.షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ - శ్రీ దేవి పెద్ద కూతురు ఝాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా ఒక ప్రేమకథతో అరంగేట్రం చేయబోతున్నారు. ఆ సినిమా పేరు ధడక్. మరాఠీ సూపర్ హిట్ సినిమా అయిన సైరట్ కు రీమేక్ గా మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాను కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పైన నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే విడుదల కాగా రెండు రోజుల్లో బోలెడన్ని వ్యూస్ సంపాదించింది. దానికి కృతజ్ఞతలు చెప్తూ కరణ్ ట్వీట్ చేశాడు. " ధడక్ ఒక ప్రేమ కథ.. ఈ అవధులు లేని - గాఢమైన ప్రేమకధను జులై 20 న చూడచ్చు. 48 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ వచ్చినందుకు కృతజ్ఞతలు" అన్నది ఆ ట్వీట్ సారాంశం.

ట్వీట్ తో పాటు ఒక పోస్టర్ కూడా షేర్ చేశాడు కరణ్. అది ట్రైలర్ లో మనం చూసిన ఒక సీన్ లోనిదే. కానీ కెమిస్ట్రీ పాలికిస్తూ ఇద్దరు చాలా చూడచక్కగా అనిపించారు. మరి వీరిద్దరి అంతులేని ప్రేమ కథ అందరికి నచ్చుతుంది అంటారా? జులై 20 వరకు ఆగల్సిందే మరి.