Begin typing your search above and press return to search.

జెర్సీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే.

By:  Tupaki Desk   |   22 April 2019 9:55 AM GMT
జెర్సీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇవే.
X
న్యాచురల్ స్టార్ నాని.. శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ' శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. మౌత్ టాక్.. రివ్యూలు అంతా పాజిటివ్ గా ఉండడంతో ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది.

జెర్సీ' మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.88 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ కలెక్షన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏపీ తెలంగాణాలో 'జెర్సీ' రూ. 10.71 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను సాధించింది. మిగతా ఏరియాలతో పోలిస్తే నైజామ్ ఏరియాలో మాత్రం 'జెర్సీ' చాలా స్ట్రాంగ్ గా సాగుతోంది. ఒక నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా దాదాపు 5 కోట్ల షేర్ వసూలు చేయడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో 'జెర్సీ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 4.90 cr

సీడెడ్: 1.03 cr

ఉత్తరాంధ్ర: 1.30 cr

కృష్ణ: 0.78 cr

గుంటూరు: 0.83 cr

ఈస్ట్ : 0.85 cr

వెస్ట్: 0.65 cr

నెల్లూరు: 0.37 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 10.71 cr