Begin typing your search above and press return to search.

ఇలా జరుగుతోందేంటి జెర్సీ !

By:  Tupaki Desk   |   25 April 2019 6:13 AM GMT
ఇలా జరుగుతోందేంటి జెర్సీ !
X
ఈ ఏడాదిలో ఇంత మెప్పు ఇన్ని ప్రశంశలు పొందిన సినిమా జెర్సీ నే అని చెప్పొచ్చు. వారు వీరు అని తేడా లేకుండా క్రిటిక్స్ మొదలుకుని సామాన్య ప్రేక్షకుల దాకా ముక్త కంఠంతో పొగడ్తలు గుప్పించిన మూవీ కూడా ఇదొక్కటే. ఈ లెక్క ప్రకారం ఇది వసూళ్ళతో హోరేత్తిపోవాలి. టికెట్లు ఈజీగా దొరకని పరిస్థితి కనిపించాలి. కాని గ్రౌండ్ రియాలిటీ దానికి భిన్నంగా ఉంది. యుఎస్ లో 1 మిలియన్ మార్క్ అయితే చేరుకుంది కాని మరీ వేగంగా అయితే కాదు.

వీకెండ్ లోనే రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ని ఇంకో రెండు రోజులు ఆలస్యంగా అందుకుంది. ఇకపై ఇంతే మొత్తం వసూళ్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. మరోవైపు అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం మొహమాటం లేకుండా బయ్యర్లు స్క్రీన్లను ఇచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జెర్సీకి యుఎస్ పెద్ద ఛాలెంజ్ గా మారబోతోంది. ట్రేడ్ రిపోర్ట్స్ సైతం ఏమంత ఉత్సాహకరంగా లేకపోవడం ఊహించని పరిణామమే.

సరే అక్కడ ఇలా జరగడం సహజమే అనుకుంటే తెలుగు రాష్ట్రాలలో జెర్సీ భీభత్సంగా రాబడుతోందా అంటే అదీ లేదు. బ్యాడ్ గా కాదు కలెక్షన్స్ డీసెంట్ గా మాత్రమే ఉన్నాయి. ఏ సెంటర్స్ ఓకే కాని బిసి కేంద్రాల్లో కొన్ని చోట్ల కాంచన 3 డామినేషన్ ఉండటం గమనార్హం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే జెర్సీ టాక్ కు వస్తున్న వసూళ్ళకు పెద్దగా పొంతన లేకపోవడం.

కనీసం మూడు వారాల పాటు హౌస్ ఫుల్స్ తో క్రేజీ రన్ కొనసాగిస్తేనే కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అనే స్టాంప్ దక్కుతుంది. అలా కాకుండా కేవలం టాక్ మాత్రమే బాగుండి అది బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఫలితాన్ని ఇవ్వకపోతే స్టేటస్ ఇవ్వడం కష్టం. జెర్సీ నిర్మాతలు కొంత దీని గురించే ఖంగారు పడుతున్నట్టు వినికిడి. ఒకవేళ వీకెండ్ నుంచి పికప్ అవుతుంది అనుకున్నా అవెంజర్స్ స్పీడ్ బ్రేకర్ లా కనిపిస్తోంది. ఇంకో వారం ఆగాక జెర్సీ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. చూద్దాం