నా డ్రెస్ నా ఇష్టం అంటున్న స్టారీమణి

Thu Feb 22 2018 22:57:37 GMT+0530 (IST)


కొన్నిసార్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లు బాగానే ఉంటారు కానీ చూసే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ విషయంలో కూడా అచ్చు ఇలానే జరిగింది. జెన్నిఫర్ లారెన్స్ నటించిన రెడ్ స్పార్రో అనే సినిమా త్వరలో మన ముందుకు రాబోతోంది. ఆ సినిమా తాలూకు ఒక ఈవెంట్ లో తీసిన ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆ ఫోటో లో జెన్నిఫర్ లారెన్స్ ఒక నల్లటి గౌన్ వేసుకుని తన కో-స్టార్స్ తో ఫోటో దిగింది. ఆ ఫొటోలో జెన్నిఫర్ దాదాపు 3 డిగ్రీల చలిలో వణుకుతూ స్లీవ్ లెస్ గౌన్ వేసుకుని ఉండగా పక్కన అందరూ యాక్టర్లు మాత్రం కోట్స్ వేసుకుని వెచ్చగా ఉన్నారు. హాలీవుడ్ లో ఫెమినిజం ఏది అంటూ చాలా మంది నిలదీశారు కొందరు. ఇకపోతే ఇంకొందరు అయితే.. అంత చలిలో కోటు స్కార్ఫ్ వేసుకోకుండా.. ఇలా క్లీవేజ్ అందాలను చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అటెన్షన్ పొందాలంటే ఇంత దిగజారాలా అని కూడా అన్నారు. ఈ కామెంట్లపై మొత్తానికి జెనిఫర్ స్పందించింది.

"ఆ వెర్సస్ డ్రెస్ చాలా అందమైనది. అంత మంచి డ్రెస్ ని నేను స్కార్ఫ్ తో కవర్ చేయాలని ఎలా అనుకుంటున్నారు? నేను మహా అయితే 5 నిమిషాలు బయట ఉన్నాను. ఆ డ్రెస్ కోసం నేను ఎంత సేపైన మంచులో నిలబడతాను ఎందుకంటే నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. అది నా ఛాయిస్. ప్రతి దానికీ ఓవర్ రియాక్ట్ అవుతూ వివాదాలను సృష్టిస్తూ ఎం వేసుకోవాలి ఎం వేసుకోకూడదు అని చెప్పడం ముందుకు వెళ్లడం కాదు. నిజమైన ప్రోబ్లేమ్స్ నుండి ఇది దారి తప్పటం లాంటిది" అంటూ అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది జెన్నిఫర్ లారెన్స్.

"నేను మీకు ఏ బట్టల్లో కనిపించినా అది కచ్చితంగా నా ఛాయిస్. నేను చలిలో నిలబడాలి అనుకున్నా సరే అది నా ఛాయిసే" అంటూ ముగించింది ఈ టాప్ హాలీవుడ్ స్టారీమణి!!