ప్రెస్ మీట్లో జీవిత ఏం చెప్పబోతోంది?

Tue Apr 17 2018 12:37:16 GMT+0530 (IST)

కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై జరుగుతున్న టీవీ చర్చల్లో భాగంగా రోజుకో కొత్త పేరు బయటికి వస్తోంది. తాజాగా సామాజిక కార్యకర్త సంధ్య.. రాజశేఖర్-జీవిత దంపతుల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. పేద అమ్మాయిల్ని వలలో వేసుకుని జీవితే వాళ్లను తన భర్త దగ్గరికి పంపేదంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఇలా జీవిత బారిన పడ్డ ఇద్దరు అమ్మాయిల ఉదంతాలు నేరుగా తనకు తెలుసని సంధ్య అంది. ఈ ఆరోపణలపై జీవిత స్పందన ఏంటన్నది తెలియడం లేదు. సంధ్య ఈ ఆరోపణలు చేసి రెండు రోజులవుతున్నా జీవిత కానీ.. రాజశేఖర్ కానీ దీనిపై మాట్లాడలేదు.ఐతే ఈ రోజు సాయంత్రం ఈ వ్యవహారంపై తాను ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ ప్రెస్ మీట్లో జీవిత ఏం మాట్లాడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శేఖర్ కమ్ముల.. కత్తి మహేష్ తరహాలో గట్టిగానే స్పందించాలని జీవిత భావిస్తోందట. తనపై ఈ ఆరోపణలు చేసిన సంధ్యపై లీగల్ యాక్షన్ తీసుకోబోతోందట జీవిత. ఇప్పటికే లాయర్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్నే జీవిత ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశముంది. జీవిత వాగ్ధాటి గురించి అందరికీ తెలిసిందే. ప్రెస్ మీట్లో ఆమె కచ్చితంగా చాలా ఆవేశంగా మాట్లాడే అవకాశముంది మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. రాజశేఖర్ ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.