Begin typing your search above and press return to search.

ఆ డైరక్టర్ నందమూరి హీరోకి ఏమిస్తాడో!!

By:  Tupaki Desk   |   23 May 2017 4:25 AM GMT
ఆ డైరక్టర్ నందమూరి హీరోకి ఏమిస్తాడో!!
X
అప్పుడెప్పుడో సిద్దార్ద్.. నిత్యా మీనన్.. ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలలో ''180'' అనే సినిమా వచ్చింది గుర్తుందా? సినిమా చూడ్డానికి టాప్ క్లాస్ ఎడ్వర్టయిజ్మెంట్ లా ప్రతీ సీన్ ప్రతీ బ్లాక్ కొత్తగా ఉంటాయి. కాని ఓవరాల్ గా కంటెంట్ మాత్రం షాక్కొట్టినట్లే ఉంటుంది. తెలుగు అండ్ తమిళంలో సినిమా ఫ్లాపైంది. అయితే ఆ సినిమా దర్శకుడు జయేంద్ర పంచపకేశన్ యాడ్ ఫిలిం మేకర్ కావడంతో.. సినిమా క్వాలిటీ బాగుంది కాని.. కథ మాత్రం ఫెయిలైంది.

ఇకపోతే ఇప్పుడు ఈ డైరక్టర్.. ఏకంగా ఆరేళ్ళ గ్యాప్ తరువాత.. ఎట్టకేలకు మరో హీరోను పట్టుకున్నాడు. వింటే షాకవుతారు కాని.. మనోడు ఆరేళ్ళ నుండి వెతుకుతుంటే తన కథకు కళ్యాణ్‌ రామ్ సెట్టవుతాడని ఫీలై.. ఇతగాడ్ని ఎంచుకున్నాడు. ఇక పటాస్ ఊపిరినిచ్చినా.. ఇజంతో మరోసారి దెబ్బతిన్న ఈ నందమూరి హీరో కూడా.. లోకల్ కుర్రాళ్ళ మసాలా కథలు వినీ వినీ అలసిపోయి.. ఇప్పుడు జయేంద్ర చెప్పిన కథను ఓకే చేసేశాడు. ఆ దెబ్బతో జయేంద్ర కూడా మాంచి ఊపుమీద ఏకంగా పిసి శ్రీరాం ను ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడానికి ఒప్పించేశాడు. బాగానే ఉంది.

ఆల్రెడీ 180 సినిమాతో కాస్త నిరుత్సాహపరిచిన ఈ డైరక్టర్.. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ కు హిట్టిస్తాడా లేదా అనేదే పాయింట్. ఎందుకంటే మనోడు ఎంతోమంది తెలుగు దర్శకుల కథలను విని రిజెక్ట్ చేసి చివరకు ఒక తమిళ డైరక్టర్ను ఎన్నుకున్నాడు కాబట్టి.. మనోడి భుజాలపై హిట్టు డెలివరీ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే కళ్యాణ్‌ రామ్ కూడా తన జడ్జిమెంట్ నిజమే అని ప్రూవ్ చేయాలి. వెయిట్ అండ్ సి.