Begin typing your search above and press return to search.

సీనియర్ డైరెక్టర్ కామెడీలు చూశారా..?

By:  Tupaki Desk   |   27 May 2017 11:46 AM GMT
సీనియర్ డైరెక్టర్ కామెడీలు చూశారా..?
X
సీనియర్ డైరెక్టర్ జయంత్.సి.పరాన్జీ దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ జయంత్ ‘జయదేవ్’ పేరుతో సినిమా చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘సేతుపతి’కి ఇది రీమేక్. రవితేజను హీరోగా చేయాలని కొన్నేళ్ల కిందటే నిర్ణయించుకున్న గంటా శ్రీనివాసరావు.. కొడుక్కి నటనలో శిక్షణ ఇప్పించారు. ఇంకా అనేక రకాలుగా ట్రైనప్ చేశారు. ఆ తర్వాత అతణ్ని నిర్మాత అశోక్ కుమార్ ద్వారా దర్శకుడు జయంత్ దగ్గరికి పంపించాడు. సినిమాల్లేక ఖాళీగా ఉన్న జయంత్ కు రవితేజను హీరోగా పరిచయం చేయడానికి ఇబ్బందేమీ లేకపోయింది.

ఐతే జయంత్ మాత్రం ‘జయదేవ్’ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెమెరామెన్‌ జవహర్‌ రెడ్డి ఒక రోజు కాల్‌ చేసి అర్జెంట్‌ గా కలవాలి అన్నాడని.. ఆయన తన వెంట ఆరున్నర అడుగుల పొడవున్న కుర్రాడి వెంట తీసుకొచ్చాడని.. తనకి సినిమాల్లో చెయ్యాలని బాగా ఇంట్రెస్ట్‌ అని చెప్పాడని.. వెయిట్ తగ్గమంటే మూడు నెలల్లో 16 కిలోలు తగ్గి వచ్చాడని.. అప్పుడతడితో సినిమా తీయొచ్చు అనిపించిందని.. అప్పుడే తనకు అతను గంటా శ్రీనివాసరావు కొడుకని తెలిసిందని మీడియాతో చెప్పాడు జయంత్. గంటా కొడుకై ఉండి.. రవితేజ తానెవ్వరో చెప్పకుండా జయంత్ ను కలిసి ఉంటాడా.. అతనెవరో తెలియకుండానే జయంత్ సానుకూలంగా స్పందించి ఉంటాడా అన్నది సందేహమే. కుర్రాడికి హైప్ తేవడానికి జయంత్ అతడి గురించి కొంచెం ఎక్కువ చేసి చెప్పాడని అనుకుంటున్నారు జనాలు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/