Begin typing your search above and press return to search.

యమపాశం.. ఇదేం టైటిల్ గురూ

By:  Tupaki Desk   |   14 Feb 2016 3:30 PM GMT
యమపాశం.. ఇదేం టైటిల్ గురూ
X
తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించిన తెలుగు కుర్రాడు జయం రవి. ఎడిటర్ మోహన్ తనయుడైన రవి.. చిన్నప్పుడు తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత హీరోగా కూడా ఇక్కడే అరంగేట్రం చేయాల్సింది. కానీ అనుకోకుండా ‘జయం’ రీమేక్ తో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అక్కడే హీరోగా స్థిరపడిపోయాడు. ఐతే మిగతా తమిళ హీరోలంతా తెలుగు మార్కెట్ మీద కన్నేస్తే.. రవి మాత్రం కోలీవుడ్ కే పరిమితమైపోయాడు. ఎట్టకేలకు అతను కూడా తెలుగు మార్కెట్ పై కన్నేసి తన కొత్త సినిమా ‘మిరుతన్’ను ‘యమపాశం’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇండియాలో జాంబీ జానర్లో తెరకెక్కిన తొలి సినిమా ‘మిరుతన్’ కావడం విశేషం. మనుషులు ఓ వైరస్ ప్రభావంతో మృగాల్లా మారిపోయి మిగతా మనుషులపై దాడి చేస్తే.. ఆ ప్రమాదం నుంచి మానవజాతిని కాపాడటానికి హీరో చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. హాలీవుడ్లో వచ్చిన ‘ఐయామ్ లెజెండ్’ తరహా సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో, అందులోనూ ఓ రీజనల్ లాంగ్వేజ్ లో ఓ సినిమా తెరకెక్కడం ఆశ్చర్యం కలిగించే విషయమే. శక్తి సౌందర్ రాజన్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. తమిళంతో పాటు, తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతోంది ఈ సినిమా. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాకు ‘యమపాశం’ అనే టైటిల్ పెట్టడమే విడ్డూరంగా ఉంది. ఇలాంటి టైటిల్ తో జనాల్ని ఆకర్షించడం కష్టమే. ఇంకేదైనా డిఫరెంట్ టైటిల్ చూసుకోవాల్సింది.