Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఇరకాటంలో జవాన్

By:  Tupaki Desk   |   21 Jun 2017 12:06 PM GMT
ఫస్ట్ లుక్: ఇరకాటంలో జవాన్
X
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ ఇప్పుడు కెరీర్ లో ఎదురదెబ్బ తినేశాడు. సుప్రీమ్ లాంటి భారీ సక్సెస్ తో.. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించిన తేజు.. ఆ తర్వాత తిక్క.. విన్నర్ ల రూపంలో రెండు ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం సాయి ధరం తేజ్ 'జవాన్' అనే మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు ఫస్ట్ లుక్ ను ఇప్పుడు రిలీజ్ చేశారు నిర్మాత కృష్ణ. దర్శకుడు బీవీఎస్ రవి పుట్టిన రోజు సందర్భంగా.. జవాన్ ఫస్ట్ లుక్ ఇచ్చారు. ఇటు దేశానికి అటు కుటుంబానికి మధ్య నలిగిపోయే కుర్రాడిగా కనిపిస్తున్నాడు సాయిధరం తేజ్. చేతిలో ఉన్న ఉన్న ఫోన్ లో ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తుండగా.. తీవ్రమైన ఆలోచనతో మథనపడుతున్నట్లుగా తేజు కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను ఇంటెన్సిటీ కనిపించేలా రూపొందించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

తేజు సరసన మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి.. ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. రీసెంట్ గా ఇటలీలో రెండు పాటలను కూడా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో హైద్రాబాద్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు ప్లాన్ చేసుకుంటున్న యూనిట్.. ఆగస్ట్ లో జవాన్ ను రిలీజ్ చేయాలని భావిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/