Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: జవాన్ యుద్దం మొదలైంది

By:  Tupaki Desk   |   23 Nov 2017 4:22 AM GMT
ట్రైలర్ టాక్: జవాన్ యుద్దం మొదలైంది
X
చాలాకాలంగా డిలే అవుతూ వస్తున్న సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా 'జవాన్' ఎట్టకేలకు డిసెంబర్ 1న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. అసలు ఈ సినిమాలో కంటెంట్ ఏంటి అంటూ అందరూ ఆలోచిస్తున్న వేళ.. ఇదేమీ రొటీన్ సినిమా కాదన్నట్లు ట్రైలర్ తో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైటర్ బివిఎస్ రవి డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

ఒక ప్రక్కన తనకు నచ్చిందేదో దొరకలేదని ఇంకా వెతుక్కునే హీరో. మరో ప్రక్కన దేశసేనలకు చెందాల్సిన మిసైల్ సిస్టమ్ ను ముందుగా తను కొట్టేయాలని అనుకునే ఒక బిజినెస్ మ్యాన్. హీరోగా సాయిధరమ్.. విలన్ గా హీరోయిన్ స్నేహ మొగుడు ప్రసన్న.. ఇంప్రెసివ్ గా ఉన్నారు. హీరోయిన్ మెహరీన్ గ్లామర్ ఎలిమెంట్ ను ఫిల్ చేస్తోందని పాటలను చూస్తేనే తెలుస్తోందిగా. ఇకపోతే ఓవరాల్ స్టోరీలైన్ మొన్న వచ్చిన పిఎస్వీ గరుడవేగ తరహాలో కొత్తగానే ఉన్నట్లు అనిపిస్తోంది. విలన్లను ఆపడానికి ఒక సాధరణ వ్యక్తి కూడా జవాన్ తరహాలో చేసే యుద్దమే ఈ సినిమా. టెక్నాలజీ ఒకవైపు.. ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ ఒకవైపు.. అన్నీ కలగలపి బివిఎస్ రవి ఈసారి చాలా డిఫరెంట్ గా ఏదో తెరకెక్కించాడని అనుకోవచ్చు.

మొత్తంగా చూసుకుంటే.. సాయిదరమ్ బాడీ లాంగ్వేజ్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. విజువల్స్ బాగున్నాయి. మరి డిసెంబర్ 1న ఈ సినిమాతో ఖచ్చితంగా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తారని ఇప్పుడు ఈ ట్రైలర్ చేసి నిస్సందేహంగా నమ్మొచ్చులే.