Begin typing your search above and press return to search.

ముస‌లాడికి ద‌స‌రా పండ‌గ‌

By:  Tupaki Desk   |   19 Sep 2018 1:30 AM GMT
ముస‌లాడికి ద‌స‌రా పండ‌గ‌
X
ముస‌లాడికి ద‌స‌రా పండుగ అంటే ఇదేనేమో! 65ఏళ్ల ఆయ‌న 28ఏళ్ల ఆవిడ‌తో ఆ కులుకులేంటో కానీ, ఒక‌టే హీట్ పెంచేస్తోంది. ప్ర‌స్తుతం ఊరూ వాడా ఇదే ర‌చ్చ‌. హ‌వ్వ‌! ఆయ‌న‌తో ఆవిడేంటి? మ‌రీ అంత ఇదైపోతోంది.. ఇంత‌కీ ఆవిడెవ‌రు? ఆయ‌నెవ‌రు? అంటూ ఒక‌టే యువ‌త‌రం నోళ్లు నొక్కుకుని, గోళ్లు గిల్లేసుకుంటున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌లే బిగ్‌బాస్ హిందీ 12వ సీజ‌న్ హ‌డావుడి మొద‌లైంది. స‌ల్మాన్ భాయ్ హౌస్‌కి అవ‌స‌ర‌మ‌య్యే కొత్త పార్టిసిపెంట్స్‌ని ప‌రిచయం చేసేశారు. ఈసారి మునుప‌టి కంటే షోని వేడెక్కించే బ్యాచీల్ని వెతికి మ‌రీ ప‌ట్టుకున్నారు. ఇందులో ఓ `విచిత్ర‌ జోడీ` మాత్రం కొంప‌లంటించేస్తున్నారు. 65 ఏళ్ల అనూప్ జ‌లోటా, 28 ఏళ్ల జ‌స్లీన్ మాథారు... ఆ ఇద్ద‌రిపైనే అంద‌రి ఫోక‌స్‌. ఈ విచిత్ర జంట‌పై ఓ ప్రోమోని క‌ట్ చేశారు. ఈ ప్రోమోలో అత‌డిని వెన‌కేస్తున్న స‌ద‌రు యువ‌తి వ్య‌వ‌హారికం చూస్తుంటే ఏదో తేడానే అన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఆవిడ‌ను చూసి ఆ ముస‌లాయ‌న అంతే ఇదైపోతూ క‌నిపించ‌డం మా గొప్ప కామెడీగానే ఉంది.

అస‌లింత‌కీ జ‌లోటాతో జ‌స్లీన్ లింకేంటి? అంటే గ‌త మూడేళ్లుగా ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు లైనేసుకుంటున్నార‌ట‌. అయితే ఇన్నాళ్లు మేమిద్ద‌రం గురుశిష్యులం మాత్ర‌మేన‌ని క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చారు కానీ, బిగ్ బాస్ పుణ్య‌మా అని అస‌లు గుట్టు ర‌ట్ట‌యిపోయింది. ఆవిడ‌తో ఆయ‌న వ్య‌వ‌హారం ఏంటో తేలిపోయింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఆ ఇద్ద‌రూ ఒకే బెడ్ పై శ‌య‌నించాలా? లేక రెండు బెడ్లు కావాలా? అన్న డిస్క‌ష‌న్ సాగుతోంది. ఇన్నాళ్లు దూరంగా ఉన్నాం ఇంకా ఎందుకు ఆల‌స్యం అంటూ జ‌లోటా సాబ్ కాస్త‌ కంగారు ప‌డిపోతున్నాడు. సింగిల్ బెడ్‌లో సిల్లీగా రొమాన్స్ చేసేయ‌డానికి ప్రిపేరైపోతున్నాడు. అయితే జ‌స్లీన్ మాత్రం కాస్తంత త‌త్త‌ర‌ప‌డిపోతూ డ‌బుల్ బెడ్‌కే ప్రిఫ‌ర్ చేస్తోంది. అదీ సంగ‌తి.