Begin typing your search above and press return to search.

నేనెందుకు వదులుకోవాలి : జాన్వీ

By:  Tupaki Desk   |   15 July 2018 6:48 AM GMT
నేనెందుకు వదులుకోవాలి : జాన్వీ
X
అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ మొదటి సినిమా దఢక్ విడుదల ఈ నెల 20న జరగనుంది. కపూర్ ఫామిలీ తో పాటు అతిలోకసుందరి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన కూతురి డెబ్యూ మూవీ రిలీజ్ కు కొద్ది నెలల ముందు శ్రీదేవి స్వర్గస్తురాలు కావడం పట్ల అభిమానులు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే జాన్వీ మీద కూడా రెండు రకాల ఒత్తిడి కొత్త సవాలు విసురుతోంది. అమ్మకు తగ్గ కూతురు అనిపించుకోవడం అందులో ఒకటైతే వారసత్వ కార్డుతో వస్తున్నారు తప్ప వీళ్లకు నిజమైన టాలెంట్ లేదనే విమర్శను తిప్పి కొట్టడం. నెపోటిజం మీద బాలీవుడ్ లో గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సైఫ్ అలీ ఖాన్-కరణ్ జోహార్-వరుణ్ ధావన్ దీని మీద పెద్ద దుమారమే రేపారు. ఇప్పుడు జాన్వీ వంతు వచ్చింది. కానీ బెరుకు లేకుండా జాన్వీ ధీటైన సమాధానం ఇవ్వడం విశేషం.

ప్రపంచంలో తనకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు అందగత్తెలు చాలా ఉన్నారని అలా అని నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకుని వాళ్లకు ఎలా ఇవ్వగలను అని చెప్పి రివర్స్ లో ప్రశ్నిస్తోంది. నేను ఎవరి అవకాశాన్నో లాక్కోవడం లేదు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి చేయగలనా లేదా అని తేల్చి చెప్పండి అంతే కానీ వదులుకోమని చెబితే ఎలా అంటూ వారసత్వ పోకడ మీద విమర్శలు చేస్తున్న వాళ్లకు గట్టి చురకే వేసింది. నాకు నటిగా అమ్మ ద్వారానే అవకాశం వచ్చింది నేనెంటో ఋజువు చేసుకుంటాను. అలా చేయలేనప్పుడు ప్రేక్షకులు బలవంతంగా చూడరు కదా అని కౌంటర్ ఇచ్చేసింది. మొత్తానికి జాన్వీ మాటలు చూసి అచ్చం అమ్మలాగే మనసులో ఉన్నది నేరుగా చెప్పేస్తోందే అనుకుంటోంది మీడియా వర్గం. మరాఠి బ్లాక్ బస్టర్ సైరాట్ రీమేక్ గా రూపొందిన దఢక్ భారీ ఎత్తున విడుదల కానుంది . ట్రైలర్ తో పాటు ఆడియో సక్సెస్ అంచనాలు పెంచేసింది. ఇది కనక సక్సెస్ అయితే జాన్వీతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అన్నట్టు తెలుగు డెబ్యూ కోసం ఇద్దరు అగ్ర నిర్మాతలు బోనీ కపూర్ తో తీవ్ర చర్చల్లో ఉన్నట్టు సమాచారం. ఏదైనా దఢక్ ఫలితం తర్వాతే ఏదైనా అంటూ కూతురి మాటే చెబుతున్నాడట నాన్న.