Begin typing your search above and press return to search.

జాహ్న‌వి చేతుల మీదుగా షారుక్ కు అవార్డు!

By:  Tupaki Desk   |   18 Jun 2018 4:51 PM GMT
జాహ్న‌వి చేతుల మీదుగా షారుక్ కు అవార్డు!
X
దివంగ‌త న‌టి శ్రీ‌దేవి గారాల‌ప‌ట్టి జాహ్న‌వి `ధ‌డ‌క్`సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ లో జాహ్న‌వి త‌న అందంతో పాటు అభిన‌యంతో కూడా ఆక‌ట్టుకుంది. ఆ ట్రైల‌ర్ ను చూసిన త‌ర్వాత ధ‌డ‌క్ పై అంచ‌నాలు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగ‌మో....లేక కాక‌తాళీయ‌మో తెలీదు గానీ....బుల్లి జాహ్న‌వికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 2002లో జరిగిన ‘జీ సినీ అవార్డు’ల కార్య‌క్ర‌మంలో షారుక్ - ప్రీతిజింతా - బోనీక‌పూర్ ల‌తో పాటు జాహ్న‌వి కూడా వేదిక‌పై సంద‌డి చేసింది. అంతేకాదు, ఆ కార్య‌క్ర‌మంలో షారుక్ కు అవార్డును ప్ర‌క‌టించింది కూడా జాహ్న‌వి కావ‌డం విశేషం. 16 ఏళ్ల క్రితం క్యూట్ గా ఉన్న బుల్లి జాహ్న‌విని చూసిన నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. దీంతో, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఆ కార్య‌క్ర‌మానికి త‌న తండ్రి బోనీ క‌పూర్ తో పాటు జాహ్న‌వి హాజ‌రైంది. ప్రీతి జింతాతో పాటు బోనీ, జాహ్న‌విలు స్టేజిపై ఉన్నారు. దేవ్‌దాస్ కు గాను షారుక్ కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును జాహ్న‌వి ప్ర‌క‌టించింది. చిన్నారి జాహ్న‌విని బోనీ ఎత్తుకోగా....బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును అందుకునేందుకు షారుక్ ను జాహ్న‌వి వేదిక‌పైకి ఆహ్వానించింది. షారుక్ స్టేజీ పైకి రాగానే జాహ్న‌వి బుగ్గపై ముద్దు పెట్టి అవార్డును అందుకున్నాడు. ఆ త‌ర్వాత‌ జాహ్నవి చేతుల మీదుగా షారుక్ ఆ అవార్డును అందుకున్నాడు. వీనుల విందైన ఈ అరుదైన వీడియో....నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంది. నాటి చిన్నారి జాహ్న‌వి....నేడు ఇంత ఎదిగిపోయిందా అంటూ నెటిజ‌న్లు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. చిన్నారి జాహ్న‌వి,బోనీ, షారుక్, ప్రీతీ జింతాలున్న ఆ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

--