జాన్వి అప్సెట్.. ప్రెస్ మీట్ నుండి వాకౌట్

Sun Jan 20 2019 17:30:51 GMT+0530 (IST)

సెలబ్రిటీల జీవితం హాయిగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారుగానీ ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టుగా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. పాత తరం హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ జెనరేషన్ హీరోయిన్లలో జాన్వికి మంచి క్రేజే ఉంది.  కానీ ఈమధ్య ఒక ప్రెస్ మీట్ నుండి మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం హాట్ టాపిక్ అయింది.రీసెంట్ గా జాన్వి ఒక ఈవెంట్ కు హాజరైంది. ఆ కార్యక్రమంలో భాగంగా మీడియా వారితో కూడా ముచ్చటించింది. మీడియావారు ప్రశ్నలు వేస్తున్నారు.. జాన్వీ సమాధానాలు చెప్తోంది. ఇంతలో ఒక రిపోర్టర్ 'శ్రీదేవి బంగాళా' సినిమా టీజర్ వివాదం గురించి అడిగాడు.  అ ప్రశ్న ఎవరిని అడిగినా పెద్దగా ఇబ్బందిపడేవాళ్ళు కాదేమో గానీ శ్రీదేవి కూతురు కావడంతో వెంటనే అప్సెట్ అయింది. జాన్వి ముఖకవళికలు మారిపోయాయి.  ఇది గమనించిన జాన్వి మేనేజర్ వెంటనే ఆ రిపోర్టర్ ను ఇలాంటి ప్రశ్న అడగడం ఏంటని మందలించాడు. ఇక ఈ ప్రెస్ మీట్ చాలు అని జాన్వికి చెప్పాడు. దీంతో జాన్వి ప్రెస్ మీట్ ను మధ్యలోనే వదిలేసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది.  

ఈమధ్య రిలీజ్ అయిన 'శ్రీదేవి బంగాళా' టీజర్ స్వర్గీయ శ్రీదేవి జీవితాన్ని పోలిఉండడంతో బోనీ కపూర్ ఇప్పటికే ఆ సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేశాడు. 'శ్రీదేవి బంగాళా' మేకర్స్ మాత్రం తమ సినిమాకు శ్రీదేవి జీవితానికి సంబంధం లేదని అంటున్నారు.