Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క‌వ‌ర్‌ పేజీ షేక్

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:52 AM GMT
ఫోటో స్టోరి: క‌వ‌ర్‌ పేజీ షేక్
X
నా క‌ళ్ల‌కు ఫ్యాన్స్ ఉన్నారు .. నాకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది! అంటూ ఓ సినిమాలో యువ‌క‌థానాయిక చేసిన‌ హంగామాని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. ఆ సినిమా కూడా అంతే పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టింది. ఆ కాటుక క‌ళ్ల‌కు బోలెడంత ఫాలోయింగ్ ఉంద‌ని ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కుమార్తె, క‌పూర్ గాళ్ జాన్వీ క‌పూర్ క‌ళ్ల‌కు అంతే ఫాలోయింగ్ ఏర్ప‌డుతోంది. ఈ భామ న‌టించిన తొలి సినిమా ధ‌డ‌క్‌ లో క‌ళ్ల‌తో చ‌క్క‌గా అభిన‌యించింద‌ని కొంద‌రు క్రిటిక్స్ ప్ర‌త్యేకించి మెన్షన్ చేస్తూ పొగిడేశారు. అందుకే ప్ర‌తిసారీ ఆ క‌ళ్ల‌ను హైలైట్ చేస్తూ జాన్వీ ఇస్తున్న ఫోజులు కుర్ర‌కారులో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.

తాజాగా ఈ యంగ్ బ్యూటీ `ఎల్‌` అఫిషియ‌ల్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీకి ఇచ్చిన ఫోజులు వేడెక్కిస్తున్నాయి. తాజా క‌వ‌ర్‌పేజీ ఒక్క‌సారిగా హీట్‌ని పెంచింది. జాన్వీలో గ్లామ‌ర‌స్ యాంగిల్‌ని ఈ ఫోటో పీక్స్‌లో రివీల్ చేసింది. ఇన్నాళ్ల పాటు ఎంత‌గా అందాల్ని ప్ర‌ద‌ర్శించినా రాని గుర్తింపు ఈ ఒక్క క‌వ‌ర్‌పేజీ తో ద‌క్కింది. జాన్వీ లోని ఒరిజినాలిటీని ఆ అంద‌మైన క‌ళ్ల ను గొప్ప‌గా ఆవిష్క‌రించారు ఈ ఫోటోగ్రాఫ్‌లో.

ఇక జాన్వీ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. క‌ర‌ణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ కం నిర్మాత అండ‌దండ‌లు త‌న‌కు ఉన్నాయి. జాన్వీ కెరీర్‌ని చ‌క్క‌దిద్దే ప‌నిలో ఉన్నారాయ‌న‌. ధ‌డ‌క్ చిత్రంతో ప‌రిచ‌యం చేసి హిట్టిచ్చి, అటుపై `త‌ఖ్త్‌` లాంటి భారీ హిస్టారిక‌ల్ చిత్రంలో అవ‌కాశం ఇచ్చాడు క‌ర‌ణ్. అలాగే ర‌ణ‌వీర్ సింగ్- వ‌రుణ్ ధావ‌న్- షాహిద్- సుశాంత్ సింగ్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించేందుకు జాన్వీ కి లైన్ క్లియ‌ర్ చేస్తున్నాడు క‌ర‌ణ్‌. ఆ క్ర‌మంలోనే ఈ భామ కెరీర్ పెద్ద రేంజుకు వెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పైనుంచి మామ్ శ్రీ‌దేవి ఆశీస్సులు త‌న‌కు బ‌లంగా ప‌ని చేస్తున్నాయ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.