Begin typing your search above and press return to search.

గ్యారేజ్ కుర్రాడు.. యూఎస్‌ లో పరీక్షలు

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:26 AM GMT
గ్యారేజ్ కుర్రాడు.. యూఎస్‌ లో పరీక్షలు
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 2న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఆ రోజున బంద్ జరగనున్న కారణంగా.. ఓ రోజు ప్రీపోన్ చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 1నే జనతా గ్యారేజ్ రిలీజ్ అయిపోనుంది. అంటే.. వచ్చే గురువారానికల్లా ఎన్టీఆర్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుందన్న మాట.

చెప్పిన డేట్ కంటే ఓ రేజు ముందే వచ్చేయడం ఫ్యాన్స్ కి సంతోషమే కానీ.. ఓ విషయంలో వాళ్లు బెంగ పెట్టేసుకుంటున్నారు. జనతా గ్యారేజ్ గురువారం రిలీజ్ కానుండడంతో.. యూఎస్ లో ప్రీమియర్లు బుధవారం రోజే పడతాయన్నమాట. వారం మధ్యలో రావడం అంటే.. అక్కడి మార్కెట్ ప్రకారం బాగా రిస్క్. ఇది ఓవరాల్ కలెక్షన్స్ ఫిగర్ పై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. నాన్నకు ప్రేమతో విషయంలో మంగళవారం నాడే ప్రీమియర్స్ వేసినా సరే 355,321 డాలర్ల వసూళ్లను వసూలు చేశాడు జూనియర్. ఇప్పుడు జనతా గ్యారేజ్ తో కనీసం 600,000 డాలర్లను అంచనా వేస్తున్నారు. కాకపోతే ప్రీమియర్లతోనే 1 మిలియన్ కలక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం.. పెద్ద పరీక్షే.

ఎన్టీఆర్ సినిమాలకు యూఎస్ లో మార్కెట్ బాగానే ఉంటుంది కాబట్టి.. టాక్ ఏ మాత్రం బాగా వచ్చినా సరే.. కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టించేసే ఛాన్సులున్నాయి. కాని ఏమాత్రం టాక్ తేడా వచ్చినా.. వీకెండ్ మొత్తం వేస్ట్ అవుతుంది.