Begin typing your search above and press return to search.

ఎన్టీఆరే అడ్డుకట్ట వేయాలి

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:30 PM GMT
ఎన్టీఆరే అడ్డుకట్ట వేయాలి
X
సినిమాలు వస్తున్నాయ్.. వెళ్తున్నాయ్.. కానీ ‘పెళ్లిచూపులు’ జోరుకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. నెగెటివ్ టాక్ తో మొదలైన సినిమాల సంగతి వదిలేద్దాం.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వేరే సినిమాలు కూడా నిలబడలేకపోతుంటే.. సరైన కలెక్షన్లు తెచ్చుకోలేకపోతుంటే.. ఈ చిన్న సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమెరికాలో ‘పెళ్లిచూపులు’ హవా మామూలుగా సాగట్లేదు. ఐదో వీకెండ్లోనూ ఈ చిత్రానికి అమెరికాలో 30 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయంటే రావడం విశేషం.

ఈ వారం నోటెడ్ రిలీజెస్ ఏమీ లేవు. ముందు వారం వచ్చిన ఆటాడుకుందాంరా.. చుట్టాలబ్బాయి సినిమాల్ని అసలు పట్టించుకోలేదు అక్కడి ఆడియన్స్. ‘బాబు బంగారం’ ఫస్ట్ వీకెండ్లో కొంచెం జోరు చూపించి.. ఆ తర్వాత డల్లయిపోయింది. దానికి ముందు వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’.. ‘మనమంతా’ సినిమాల పరిస్థితీ అంతే. ‘శ్రీరస్తు శుభమస్తు’ను ఈ వారం అమెరికాలో రీరిలీజ్ చేశారు కూడా. అయినా కలెక్షన్లు అంతంతమాత్రమే. మొత్తంగా గత నెల రోజుల నుంచి అమెరికాలో ‘పెళ్లిచూపులు’ హవానే సాగుతోంది.

ఆ చిత్రం ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగుపెట్టేసి.. మరింతగా కలెక్షన్లు కొల్లగొడుతూ వెళ్తోంది. ఈ వారం ‘జనతా గ్యారేజ్’ వస్తే తప్ప ఆ సినిమా జోరు తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘పెళ్లిచూపులు’ డ్రీమ్ రన్ కు బ్రేకులు పడొచ్చు. ఆ సినిమా కథ ముగియొచ్చు. ‘జనతా గ్యారేజ్’కు నెగెటివ్ టాక్ వస్తే మాత్రం ఇంకొన్ని రోజులు ‘పెళ్లిచూపులు’ హవా కొనసాగే అవకాశముంది. ‘జనతా గ్యారేజ్’ కోసం ‘పెళ్లిచూపులు’ను థియేటర్లు కూడా బాగా తగ్గిస్తున్నారు. బుధవారం భారీ స్థాయిలో గ్యారేజ్ ప్రిమియర్లు ప్లాన్ చేస్తున్నారు.