Begin typing your search above and press return to search.

సెన్సార్ టాక్‌: యు/ఎ తెచ్చుకున్న గ్యారేజ్

By:  Tupaki Desk   |   26 Aug 2016 1:11 PM GMT
సెన్సార్ టాక్‌: యు/ఎ తెచ్చుకున్న గ్యారేజ్
X
ముందుగా చెప్పుకున్నట్లే ఈరోజు ఉదయం ''జనతా గ్యారేజ్'' సినిమా సెన్సార్ కత్తెర్లు వేయించుకోవడానికి వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరక్షన్లో రూపొందిన సినిమా.. ఈ నెల 1న రెడీ అవ్వడానికి సర్వం సిద్దం చేసుకుని.. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ కోసం బయలుదేరిందనమాట. ఇంతకీ వాళ్ళు ఏమన్నారు మరి?

సినిమాలోని పాటల్లో హీరోయిన్ల గ్లామర్.. అలాగే సెకండాఫ్‌ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా.. సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ రెండు మూడు కట్స్ కూడా సూచించారట. అంతేకాదు.. ఒకవేళ బోర్డు వారు చెప్పిన భారీ కట్ లిస్ట్ ను కనుక ఇంప్లిమెంట్ చేస్తే.. యు సర్టిఫికేట్ వచ్చే ఛాన్సుండేదట. అయితే కమర్షియల్ సినిమాలు అన్నాక పైట్లు అండ్ గ్లామర్ లేకపోతే ఎలా.. అందుకే యు/ఎ కే మొగ్గుచూపారు నిర్మాతలు.

కంటెంట్ విషయానికొస్తే.. సినిమాలో ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ సీన్లు చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. అలాగే రెండు పాటలు కూడా ఇరగదీశాయట. ముఖ్యంగా సమంత గ్లామర్ అండ్ ఎన్టీఆర్ స్టెప్ప్ ఆ పాటల్లో అదిరిపోయాయ్ అని టాక్. గెట్ రెడీ ఫర్ సెప్టెంబర్ ఒకటి.