ఇదేంటి బిగ్ బాస్!!

Mon Jun 25 2018 17:47:01 GMT+0530 (IST)

బిగ్ బాస్ పేరు ఒకటైనా పైత్యంలో  మాత్రం  బాషకో రకంగా చూపిస్తున్నాడు. వివాదాలు రేపి దాని మూలంగా రేటింగ్స్ తెచ్చుకోవడం అనే కాన్సెప్ట్ మీద రన్ అయ్యే బిగ్ బాస్ ఇతర భాషలతో పోలిస్తే  తెలుగునే చాలా బెటర్ అని చెప్పొచ్చు. యాంకర్లు గా చేసిన జూనియర్ ఎన్టీఆర్ లేదా చేస్తున్న నాని ఆంక్షల వల్లనో లేక తెలుగు ప్రేక్షకులు ఇలాంటివి మితిమీరితే సహించరన్న లెక్కల మూలనో చెప్పలేం కానీ ఇక్కడ వరకు చాలా కంట్రోల్ లోనే ఉంది. కానీ కమల్ హాసన్ నడిపిస్తున్న తమిళ బిగ్ బాస్ 2 మాత్రం మొహమాటానికి ఆమడ దూరంలో ఉంటూ రెచ్చగొట్టే కాన్సెప్ట్స్ తో హిందీ షోతో పోటీ పడుతోంది.ఇటీవలే ఇందులో పార్టిసిపేంట్స్ గా ఉన్న జననీ అయ్యర్-ఐశ్వర్య దత్త ఏ మాత్రం ఆలోచించకుండా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడని లిప్ టు లిప్ కిస్ చేసుకోవడం వాటి తాలూకు పిక్స్ వైరల్ కావడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఖుషి భామ ముంతాజ్ ఏకంగా డైపర్లు వేసుకుని హౌస్ లో తిరగటం పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. బిగ్ బాస్ చెబుతున్నాడు అని ఈ రొచ్చు చేయటం బాగానే ఉంది కానీ ఇక్కడ హోస్ట్ గా ఉన్న కమల్ ఇమేజ్ రిస్క్ లో పడుతోంది. అసలే రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని ఒక పక్క మైకులో చెబుతూ ఇలాంటి వివాదాస్పద షోకు యాంకర్ కు ఉండటం అంటే ప్రతిపక్షానికి తనను కామెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే.

పైన చెప్పిన  టాస్కులు సభ్య సమాజం మెచ్చేవి కాదు ఒప్పుకునేవి అంత కన్నా కాదు. అలాంటప్పుడు కమల్ వీక్ ఎండ్ లో మాత్రమే వచ్చినా సరే  జరిగిన వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హౌస్ లో జరిగేవి తాను చెప్పేవి కాదు కానీ బిగ్ బాస్ వ్యాఖ్యాతగా తననే అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి కమల్ జాగ్రత్త వహించి నిర్వాహకులకు  హింట్ ఇస్తే బెటరేమో. తెలుగులో కూడా కొన్ని విపరీతంగా అనిపిస్తున్న టెస్టులు పెడుతున్నప్పటికీ మరీ హద్దులు దాటినవి ప్రస్తుతానికి లేవు. కానీ తమిళ్ లో మాత్రం మసాలా ఘాటు బాగా ఎక్కువైపోయి జనం కామెంట్స్ చేసే దాకా వెళ్లిపోయింది. కమల్ షో వేరు రాజకీయాలు వేరు అంటాడా డ్యామేజ్ రిపేర్  కు పూనుకుంటాడా వేచి చూడాలి.