Begin typing your search above and press return to search.

బాహుబలి స్టుపిడ్ మూవీ -సీనియర్ నటి

By:  Tupaki Desk   |   24 Jan 2016 4:24 AM GMT
బాహుబలి స్టుపిడ్ మూవీ -సీనియర్ నటి
X
దేశంలోనే అతి గొప్ప గ్రాఫికల్ వర్క్ మూవీగా చరిత్ర సృష్టించింది బాహుబలి. టెక్నికల్ గా ఇండియాలో ఎవరూ అందుకోలేనంత స్థాయిలో నిలిచింది. అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన సినిమాగా కూడా చరిత్రలో నిలిచిపోనుంది. అలాంటి బాహుబలిని.. అలనాటి నటి జమున తీసిపారేశారు. అసలు బాహుబలిని ఓ స్టుపిడ్ మూవీ అనేశారామె. ఊరికినే అనడమే కాదు.. అందుకు తగిన కారణాలు కూడా జమున చెప్పారు.

చాలా ఏళ్ల క్రితమే సినిమాలు చూడడం మానేశారు జమున. కానీ రీసెంట్ గా బాహుబలి గురించి జరిగిన ప్రచారం చూశారట. అయితే ఇదో వేస్ట్ మూవీ అన్నారామె. బాహుబలి ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అందులో ఉన్న సాంకేతిక విలువలు మాత్రమేనని తేల్చేశారామె. 'హీరో ఒక్క పాత్ర తప్పితే, మిగతా అన్ని పాత్రలకు నటీనటుల ఎంపిక కూడా సరిగా చేయలేకపోయారు. బాహుబలిలో అనుష్కను హీరోయిన్ గా చేయాల్సి ఉంది' అన్నారు జమున.

'ఇప్పటి సినిమాల్లో హీరో పాత్ర ఎంతమంది విలన్స్ ని కొట్టాడు, మరెంత మందిని చితక్కొట్టాడు అన్నట్లుగానే ఉంటోంది. ఇక హీరోయిన్స్ ని అయితే, కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు' అని అభిప్రాయపడ్డారు జమున. అయితే.. ఆమెకు బాహుబలి నచ్చకపోవడానికి కారణం ఆమె నటించిన కాలంలో, ఇంతగా సాంకేతిక విలువలు లేకపోయినా, అనేక జానపద చిత్రాలు తీశారు. మాయలు మంత్రాలు ఉన్నా.. వాటికి మించిన కథాబలం ఉండేదని ఆమె ఉద్దేశ్యం కావచ్చు.