స్టూడెంట్స్ ను వేధిస్తున్న స్పైడర్ విలన్

Sat Jan 13 2018 05:00:01 GMT+0530 (IST)

గత కొంత కాలంగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. గ్లామర్ ఇండస్ట్రీలో అమ్మాయిలను వారి కెరీర్ మెరుగయ్యేలా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి.. లైంగికంలో లోబరుచుకోవడం అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది భామలు బైటకు వచ్చిన బాహాటంగా ఈ కామెంట్స్ చేస్తుండడం విశేషంగానే చెప్పాలి.అయితే.. ఇది ఇండియాలాంటి దేశాల్లోనే కాదు.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉంటుందనే సంగతి ఇప్పుడు అర్ధమవుతోంది. స్పైడర్ మ్యాన్ మూవీస్ లో  విలన్ గా కనిపించిన జేమ్స్ ఫ్రాంకోపై ఇప్పుడు ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఇతను ప్రారంభించిన ఓ యాక్షన్ స్కూల్ కు బాగానే రెప్యుటేషన్ ఉంది. కానీ ఇందులో చేరిన స్టూడెంట్స్ ను లోబరచుకుంటున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 4గురు మహిళలతో పాటు.. అతని మెంటార్ కూడా జేమ్స్ పై ఆరోపణలు గుప్పించడం సంచలనం అవుతోంది. వారి కెరీర్ ఎదిగేలా సహకరిస్తానంటూ.. దారుణమైన చర్యలకు పాల్పడుతున్నాడట జేమ్స్ ఫ్రాంకో. షూటింగ్ సమయంలో మహిళల రహస్య అవయవాలను కవర్ చేసేలా కొన్ని ప్లాస్టిక్ కవర్స్ ఉపయోగిస్తారు.

ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరణ సమయంలో.. ఆ ప్లాస్టిక్ కవర్స్ ను తొలగించేయడం వంటి దారుణాలను కూడా చేస్తున్నాడట జేమ్స్. ఇతడు సెట్స్ లో ఉండగా టాప్ లెస్ గా నటించేందుకు ఎవరూ సాహసించడం లేదు కూడా. ఇతని దగ్గర స్టూడెంట్ గా చేరిన ఓ మహిళ ఈ విషయాన్ని బాహాటంగా చెప్పడంతో.. స్పైడర్ మ్యాన్ విలన్ భాగోతం రట్టయింది.