ట్రైలర్ టాక్: జంబలకిడి కామెడీ పంబ

Tue Jun 12 2018 11:57:15 GMT+0530 (IST)

అప్పట్లో ఇవివి.సత్యనారాయణ దర్శకత్వంలో పవచ్చిన జంబలకిడి పంబా టాలీవుడ్ కి కొత్త అర్ధాన్ని చెప్పింది. ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఆ సినిమాకు అప్పట్లో ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. అయితే మరి ఆ స్థాయిలో కాకపోయినా కొంచెం ఆ ఫార్ములాతో మనిషి లింగ బేధాలు మారడం అనే కాన్సెప్ట్ తో మరో జంబలకిడి పంబ వస్తోంది. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి - సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.ఆడవాళ్లు మగవాళ్ళు  గా మారడం మగవాళ్లు ఆడవాళ్లు గా మారడం ఇవివి చూపించగా ఇప్పుడు జేబీ.మురళి కృష్ణ ఆ మసాలాను తగిలించి భార్య భర్తల్లో ఆ వ్యత్యసాన్ని సున్నితంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ మంచి టాక్ ను అందుకుంటోంది. చూస్తుంటే మరో కామెడీ ఎంటర్టైనర్ పక్కా అని తెలుస్తోంది. వెన్నలకిషోర్ మరికొంత మంది సీనియర్ కమెడియన్స్ సినిమాలో కనిపిస్తుండడం స్పెషల్.

భార్య భర్తలు విడాకులను కోరడం ఆ తరువాత లాయర్ చేసిన ప్రయత్నాలు వారు మగ అడ వేషాలు ఎందుకు తారుమారయ్యాయి అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని పంచులు కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో నవ్విస్తుందో చూడాలి. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను రవి - జోజో జోస్ అలాగే శ్రీనివాస్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.