Begin typing your search above and press return to search.

జక్కన్నకు కామెడీ సీన్లే బలమంట!

By:  Tupaki Desk   |   27 July 2016 4:02 AM GMT
జక్కన్నకు కామెడీ సీన్లే బలమంట!
X
ఈవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒకటి పెళ్లి చూపులు కాగా.. మరొకటి సునీల్ నటించిన ‘జక్కన్న’. ఇప్పటికే పెళ్లి చూపులు సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చేసింది. ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు. సురేష్ బాబులాంటి నిర్మాత అండగా వుండటంతో... ఈ చిత్రం నిర్మాత రాజ్ కందుకూరికి ప్రమోషన్ చాలా సులువైందనే చెప్పొచ్చు. ఇకపోతే.. సుదర్శన్ రెడ్డి నిర్మించిన జక్కన్నను కూడా శాయశక్తులా ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇటీవలే యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని సీన్లను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారట. కామెడీ సీన్లు.. మధ్యలో వచ్చే ట్విస్టులతో సినిమా బాగానే ఎంటర్టైన్ చేసింది అంటున్నారు. అలానే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుందట. చాలా కాలం నుంచి హిట్ కోసం తపిస్తున్న సునీల్ ఈ చిత్రంతో ఎలాగైనా గట్టెక్కాలని చూస్తున్నాడు. ఈ చిత్రలో స్టార్ కమెడియన్ సప్తగిరి చేసే కుంగ్ ఫూ విన్యాసాలు చిత్రానికే హైలైట్ అంటున్నారు. ట్రైలర్లో కూడా ఇవి తెగ నవ్విస్తున్నాయి. చూడాలి.. సినిమాలో ఇంకెన్ని విన్యాసాలు చేశాడో సప్తగిరి.