ఫస్ట్ డే కలక్షన్: బాలయ్య బాగానే లాగారే

Sat Jan 13 2018 14:08:05 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం జైసింహా.. సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. నిన్ననే థియేటర్లలో అడుగు పెట్టిన ఈ చిత్రం ఎంతమేర వసూళ్లు సాధిస్తుందనే ఆసక్తి సర్వత్రా కనిపించింది. ముఖ్యంగా మూవీకి టాక్ అంత ప్రోత్సహకరంగా లేకపోవడంతో.. బాలయ్య మూవీ వసూళ్లను అందరూ గమనించడం ప్రారంభించారు. అయితే.. తొలి రోజు వసూళ్ల విషయంలో.. జైసింహా డీసెంట్ అనిపించుకుంది. బాలకృష్ణ కెరీర్ లో తొలి రోజు వసూళ్ల సాధనలో మూడో స్థానంలో నిలిచింది. గౌతమి పుత్ర శాతకర్ణి.. పైసా వసూల్ తర్వాతి స్థానంలో జైసింహా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం. .ప్రపంచవ్యాప్త షేర్ కలెక్షన్స్ 8 కోట్లను దాటాయి.
 
ఏరియాల వారీగా సాధించిన వసూళ్లు:నైజాం - రూ. 11600000

సీడెడ్ - రూ. 15300000

నెల్లూరు - రూ. 3700957

గుంటూరు - రూ. 11548191

కృష్ణా - రూ. 4617388

వెస్ట్ - రూ. 8100000

ఈస్ట్ - రూ. 8526338

ఉత్తరాంధ్ర - రూ. 7500000

తొలి రోజు AP & TS షేర్ -రూ. 7.08 కోట్లు (9.70కోట్ల గ్రాస్)

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు షేర్ : రూ. 8.25 కోట్లు (12 కోట్ల గ్రాస్)

రిలీజ్ కి ముందు అంచనాలు లేకపోవడం.. పాత తరం కథ.. కేఎస్ రవికుమార్ కథనంతో ఆకట్టులేకపోవడం.. భారీ పోటీ లాంటి ఎన్ని మైనస్ లు ఉన్నా.. సంక్రాంతి హీరోగా బాలయ్య తన సత్తాను బాగానే చాటారని చెప్పాలి.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!