Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాకి ఆ పేరే కన్ఫాం

By:  Tupaki Desk   |   17 March 2017 3:14 PM GMT
ఎన్టీఆర్ సినిమాకి ఆ పేరే కన్ఫాం
X
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం యంగ్ టైగర్ కూడా షూటింగ్ కి వచ్చేశాడు. ఆ రోజున స్పాట్ నుంచి ఓ ఫోటోను డైరెక్టర్ షేర్ చేశాడు కానీ.. అందులో జూనియర్ వెనక్కి తిరిగి ఉండడంతో.. ఎలా ఉన్నాడనే విషయం తెలియలేదు.

అయితే.. ఈ చిత్రం కోసం కొన్ని వారాలుగా తెగ వర్కవుట్స్ చేస్తున్న ఎన్టీఆర్ దాదాపు 12 కిలోలు తగ్గిపోయాడని చెబుతున్నారు. కొంత తగ్గిన మాట వాస్తవమే అయినా.. మరీ ఎక్కువేమీ తగ్గిపోలేదని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై.. ఇప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన తర్వాత నుంచి.. క్లాప్ బోర్డ్ పై "జై లవ కుశ" అని రాస్తున్న వైనం తెలియవచ్చింది. అంటే.. ఎన్టీఆర్-బాబీల సినిమాకి ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసేసినట్లే. జస్ట్ అనౌన్స్ మెంట్ ఒక్కటీ బ్యాలెన్స్ అంతే. లవకుశ అనే టైటిల్ పై సీనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కారణంగా.. ఆ టైటిల్ చాలా పవర్ ఫుల్.

అప్పట్లో బళ్లు కట్టుకుని మరీ థియేటర్లకు వచ్చి.. అక్కడే వంటావార్పు చేసుకుని ఆ సినిమా చూశారని చెబుతుంటారు. ఇప్పుడు తను చేయనున్న సినిమాలో మూడు పాత్రలు ఉండడం.. జై.. లవ.. కుశ.. అనే కేరక్టర్స్ కావడంతో.. రెండు విధాలుగాను జై లవ కుశ టైటిల్ తనకు కలిసి వస్తుందని ఫిక్స్ అయ్యాడట జూనియర్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటివరకూ ఒక్క రాశి ఖన్నా పేరు మాత్రమే అనౌన్స్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/