Begin typing your search above and press return to search.

జాగ్వార్ పేరుతో పండగే పండగ

By:  Tupaki Desk   |   30 Sep 2016 11:30 AM GMT
జాగ్వార్ పేరుతో పండగే పండగ
X
ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఒక గ్రాండ్ అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు క్యాష్‌ చేసుకోవడానికి రెడీగా ఉంటారు మీడియా వారు కూడా. గతంలో దిల్ రాజు ఒక యాక్షన్ కమిటీ ఫామ్ చేసి.. ఓ రెండు ఛానళ్లకు తప్పించి అందరికీ యాడ్లు కట్ చేస్తాం అంటే ఎంతటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఒక సినిమా పేరు చెప్పి అందరూ ఎలా పండగ చేసుకుంటున్నారో చూద్దాం.

ఈ ''జాగ్వార్'' సినిమాను అన్ని ఛానళ్లలో గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని.. తన కొడుకు నిఖిల్ కుమార్ ను గ్రాండ్ గా లాంచ్ చేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి డిసైడయ్యారు. ఇప్పటికే లక్షల్లో ఖర్చుపెట్టి వెబ్ లో సినిమాను ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్న జాగ్వార్ టీమ్.. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానళ్లకు కూడా ఒక ఇంటర్యూ పెట్టుకుంటే ఇంత పే చేస్తాం అంటూ ప్యాకేజ్ ఆఫర్ చేశారట. ఇంకేముంది.. మామూలుగా అయితే ఖాళీ స్లాట్ లో ఇంటర్యూలు పెట్టడం పెద్ద కష్టమేం కాదు కాని.. ఇప్పుడు మాత్రం పేమెంట్ క్యాండెట్ కాబట్టి ప్రైమ్ స్లాట్ లో మనోళ్ళు ఇంటర్యూలకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఒక్కో ఛానల్ కు దాదాపు 10 లక్షల వరకు అందుతోందని తెలుస్తోంది.

మొత్తానికి దసరా పండగ కంటే కూడా ఈ జాగ్వార్ పండగే చాలా పెద్దదిలా ఉంది మనోళ్ళకు. కానివ్వండి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/