Begin typing your search above and press return to search.

జగ్గూ భాయ్ కి కోపం... నిజమేనా?

By:  Tupaki Desk   |   3 Aug 2015 4:26 PM GMT
జగ్గూ భాయ్ కి కోపం... నిజమేనా?
X
మహేష్ మూవీ శ్రీమంతుడు రిలీజయ్యాక ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో ఇంకా చెప్పలేం కానీ... విడుదలకు ముందే దీని మీద వస్తున్నన్ని పుకార్లు, న్యూస్, వ్యూస్ చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. చాలా తక్కువ మూవీలకు ఇంతటి ఫాలోయింగ్ వస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ హాటెస్ట్ రూమర్ ఏంటంటే... కొరటాలమీద శ్రీమంతుడి నాన్న కస్సుబుస్సుమంటున్నాడట. కారణం.. తన పాత్రని ఇష్టం వచ్చినట్లుగా కట్ చేసేయడమేనని తెలుస్తోంది.

మహేష్ తండ్రిగా జగపతిబాబు.. నటించడమంటే.. ఎదురెదురుగా రెండు దిగ్గజాలు ఉన్నట్లే. ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్ కాబట్టే... ప్రిన్స్ కి తండ్రిగా చేసేందుకు కమిటయ్యాడు జగ్గూ భాయ్. కానీ పూర్తి సినిమా అవుట్ పుట్ చూసి మాత్రం.. మనోడు నోరెళ్లబెట్టాడంట. గట్టిగా లెక్కెడితే పట్టుమని 10నిమిషాలు కూడా కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోవడం జగపతిబాబు వంతైందట. అయితే... ఇది మహేష్ బాబు సినిమా కావడంతో... నోరు మెదపలేదులెండి.

జగపతిబాబుకి కోపం వచ్చిందనే వార్త నమ్మడానికి వీలుగానే ఉన్నా... నిజానిజాలపై ఖచ్చితత్వం లేదు. వాస్తవానికి పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి రూమర్స్ చాలానే వస్తాయి. గతేడాది సత్యమూర్తిలో తన పాత్ర నిడివి, ప్రభావం తగ్గిపోయిందని ఉపేంద్ర ఫీలయ్యాడనే వార్త గట్టిగానే వినిపించింది. అంతకుముందు మగధీర విషయంలోనూ శ్రీహరి ఇలాగే హర్ట్ అయ్యాడంటారు. కానీ... ఈ మూవీస్ రిలీజయ్యాక.. ఎక్కువ పేరు వచ్చింది ఈ పాత్రలకే. సో, ఇప్పుడు జగపతిబాబు పాత్ర కూడా ఇలాంటిదే కావచ్చు. మొత్తం సినిమా నిడివి ఎక్కువగా ఉండడంతో ఒకవేళ తగ్గించినా.. సినిమాపై ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకునే బాధ్యత డైరెక్టర్ల దే కదా. ఆ మాత్రం జాగ్రత్తగానే ఉంటారు లెండి మన దర్శకులు.