ఎట్టకేలకు జగపతికి ఆ ఆనందం

Wed Sep 13 2017 14:25:02 GMT+0530 (IST)

జగపతి బాబు.. మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న నటుడు. హీరోగా కెరీర్ ప్రారంభించి.. ఫ్యామిలీ హీరోగా టర్నవుట్ తీసుకుని.. మధ్యమధ్యలో మాస్ సినిమాలతో మెప్పించి.. కామెడీ మూవీస్ తో ఆకట్టుకుని.. ఇప్పుడు విలన్ గా తన కెరీర్ ను మలుచుకున్నాడు.అయితే.. ఇంత సుదీర్ధమైన కెరీర్ లో మెగా హీరోలతో నటించలేదనే కోరిక మాత్రం చాలా కాలంగా ఈ హీరో కం విలన్ ను వెంటాడుతోందట. తేజు కెరీర్ ప్రారంభంలో అతడితో కలిసి నటించినా.. మెగా హీరోల్లో స్టార్స్ తో నటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగపతి బాబు డ్రీమ్ నెరవేరబోతోంది. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న రంగస్థలం మూవీలో నటిస్తున్న జగపతిబాబు.. ఇప్పుడు మరో అపురూపమైన అవకాశం కూడా దక్కించుకున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న మెగస్టార్ 151 మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా జగపతి నటిస్తున్నాడు.

అంతే కాదు.. ఈ సినిమాలో చాలాభాగం పాటు చిరు వెంటే ఉండే పాత్ర ఇది అని తెలుస్తోంది. అయితే.. వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే అత్యంత కీలకమైన పాత్రను జగపతికి ఆఫర్ చేశారట. ఇటు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో.. అటు చిరంజీవితో ఒకేసారి నటించే అపురూపమైన అవకాశం చేతికి చిక్కడంతో.. జగపతి బాబు ఆనందానికి అవధులు లేకపోకుండా పోయాయని అంటున్నారు.