తారక్ ఆ డేర్ ఏంటి అనడిగా! -జగపతిబాబు

Sat Oct 20 2018 18:44:03 GMT+0530 (IST)

ఎన్టీఆర్ - జగపతిబాబు పోటాపోటీగా నటించిన సినిమా అరవింద సమేత. హీరోగా తారక్ - విలన్ గా జగపతిబాబు నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరవింద సమేత ఘనవిజయంలో ఆ ఇరువురూ కీలక పాత్రధారులే. త్రివిక్రమ్ మాటల మాయాజాలం అంతే పని చేసిందన్న ప్రశంసలు దక్కాయి.  ఈ సందర్భంగా విలన్ పాత్రధారి జగపతిబాబు హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా కుండబద్ధలు కొడుతూ కొన్ని ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించారు.అసలు అరవింద సమేత - వీర రాఘవ చిత్రంలో మీ పాత్ర లేకపోతే సినిమానే లేదు అన్నంత  పేరొచ్చింది కదా?   అన్న ప్రశ్నకు.. అది చాలా తప్పు. అలా అనకూడదని జగపతిబాబు అన్నారు. నేను కూడా తారక్ ని ఇదే ప్రశ్న అడిగాను. నీ ధైర్యం ఏంటి? అని అడిగాను. తారక్ నా పాత్ర డామినేట్ చేస్తున్నా నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు . విలన్ పాత్ర డామినేట్ చేస్తోంది కదా! అని అడిగితే సినిమా పెద్దది.. హీరో పెద్దోడు కాదు అన్నారు. నువ్వు ఎంతయినా చెయ్.. హీరో నేను .. సినిమా నాది.. అంటూ ఎంకరేజ్ చేశారు. బసిరెడ్డి లేకపోతే తారక్ లేడు! అని ప్రమోషన్ లోనూ ఎంకరేజ్ చేశాడు తారక్... అనీ జగపతి అన్నారు.

అసలు హీరోనే మెచ్చుకోవాలి. ఒక పాత్రను ఒప్పుకున్నాడు. హీరోయిజం చూడలేదు అంటూ అభిమానులే మెచ్చుకున్నారనీ అన్నారు. ఇప్పటివరకూ గ్రామాల్లో జగపతిబాబు ఎవరో తెలీదు. అరవింద సమేత పాత్ర వల్ల కనెక్టయ్యానని సూటిగా అనేశారు జగపతి. నాకు ఆశ్చర్యం వేసింది... అనీ అన్నారు.