Begin typing your search above and press return to search.

రియాల్టీ సంస్థ మోసంతో రోడ్డెక్కిన జ‌గ‌ప‌తి బాబు

By:  Tupaki Desk   |   17 Aug 2017 1:33 PM GMT
రియాల్టీ సంస్థ మోసంతో రోడ్డెక్కిన జ‌గ‌ప‌తి బాబు
X
ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ చేసిన చీటింగ్‌ తో వీఐపీలు నిర‌స‌న బాట ప‌ట్టారు. ప్ర‌ముఖుల‌తో క‌లిసి కోట్లాది రూపాయ‌లు చెల్లించిన వారు నిర‌స‌న తెలిపారు. ఈ ప‌రిణామంతో షాక్ తిన్న వారు హైద‌రాబాద్‌ లో నిర‌స‌న తెలిపారు. మెట్రో న‌గ‌రాల్లో ప్ర‌ముఖ బిల్డ‌ర్ సంస్థ‌గా పేరొందిన లోధా సంస్థ త‌మ‌ను మోసం చేసింద‌ని పేర్కొంటూ స‌హ కొనుగోలుదారుల‌తో క‌లిసి జ‌గ‌ప‌తిబాబు మీడియాతో తెలిపారు. కూక‌ట్‌ ప‌ల్లిలో విలాస‌వంత‌మైన బెలిజా అపార్ట్‌ మెంట్ నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించిన లోధా సంస్థ దాన్ని నిలుపుకోవ‌డంలో వైఫ్య‌లం చెందింద‌ని మండిప‌డ్డారు.

త‌మ‌కు 10.5 ఎక‌రాల స్థ‌లంలో విలాస‌వంత‌మైన ఫ్లాట్ల‌ను నిర్మిస్తామ‌ని చెప్పి మూడు ఎక‌రాల్లో మాత్ర‌మే మెరిడియ‌న్ అపార్ట్‌ మెంట్లు నిర్మించార‌ని జ‌గ‌ప‌తిబాబు ఆరోపించారు. లోధా సంస్థ ప్ర‌చారం చూసి ఎంతో మంది న‌మ్మి మోసపోయార‌ని జ‌గ‌ప‌తి బాబు పేర్కొన్నారు. సంస్థ తీరు ఇబ్బందిక‌రంగా ఉందని అందుకే తాము రోడ్డెక్కాల్సి వ‌చ్చిందిన తెలిపారు. జీహెచ్ ఎంసీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ నిర్మించార‌ని జ‌గ‌ప‌తి బాబు ఆరోపించారు. త‌మ స్వేచ్ఛ‌కు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన లోధా సంస్థ‌ పై జీహెచ్ ఎంసీ వ‌ర్గాల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు జ‌గ‌ప‌తి బాబు స్ప‌ష్టం చేశారు.

కాగా, లోధా సంస్థ త‌మ‌ను మోసానికి గురిచేసింద‌ని ఇత‌ర వినియోగ‌దారులు మండిప‌డ్డారు. మందుగా పేర్కొన్న అంత స్థ‌లంలో నిర్మాణాలు చేయ‌క‌పోవ‌డం - నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా లోధా సంస్థ తీరు ఉంద‌ని విమ‌ర్శించారు. ఈ విష‌యంలో జీహెచ్ ఎంసీని ఆశ్ర‌యించి న్యాయం కోర‌నున్న‌ట్లు వివ‌రించారు. ఒక‌వేళ గ్రేట‌ర్ అధికారులు స్పందించ‌క‌పోతే...తాము హైకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని వారు స్ప‌ష్టం చేశారు.