గుర్రంలా రెచ్చిపోతున్న జాక్వెలిన్

Tue Jan 10 2017 04:35:06 GMT+0530 (IST)

శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో ఓ భాగం అయిపోయి చాలాకాలమే అయింది. సల్మాన్ ఖాన్ తో కలిసి మాంచి కిక్ ఇచ్చిన తర్వాత.. ఇక ఈ బ్యూటీ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. వరుసగా క్రేజీ మూవీస్ చేసేస్తూ బాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

సినిమాల్లోనే కాదు.. ఏ సమయంలో చూసినా గ్లామర్ కురిపించేయడంలో జాక్వెలిన్ కి బోలెడంత ఎక్స్ పీరియన్స్ ఉంది. ఏ టైం లో కెమేరాల ముందు దొరికినా.. అద్భుతమైన సొగుసులతో.. అదిరిపోయే గ్లామర్ ను ఒలికించేస్తూ ఉంటుంది. కార్ లోంచే ఫోటోలకు పోజులు ఇస్తున్న ఈ 31 ఏళ్ల అందాన్ని చూడండి. కంటి కులుకుల నుంచి కాలి సొగసుల వరకు.. చిట్టి పొట్టి ప్యాంట్ ఒకటి వేసుకుని మహా రచ్చ చేసిపారేస్తోంది.

సినిమాలు చేయడమే కాదు. వాటిని ఎంచుకోవడంలో అమ్మడు చూపించే ట్యాలెంట్.. ఈమెకు అసలైన ఎస్సెట్. చేసిన వాటిలో ఎక్కువ భాగం హిట్ అయిపోతుండడంతో.. ఈ మిస్ శ్రీలంక.. ఇండియన్ ఆడియన్స్ కు తెగ దగ్గరైపోతోంది. ప్రస్తుతం సిద్ధార్ధ మల్హోత్రాతో రీలోడెడ్ అనే మూవీలోను.. వరుణ్ ధావన్ తో కలిసి జుడ్వా2(హలో బ్రదర్ సీక్వెల్) లోను జాక్వెలిన్ సందడి చేయనుంది.