రేస్ భామ మతిపోయే భంగిమ

Wed Jun 13 2018 13:04:42 GMT+0530 (IST)

అనుకుంటాం కానీ సినిమాల్లో మనకు పుష్టిగా అందంగా కనిపించే నటీనటుల వెనుక కష్టం చిన్నదేమి కాదు. పాత్ర డిమాండ్ చేసిందనో  లేక అవకాశాలు తగ్గకుండా ఉండటం కోసమనో తమ శరీరం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే హీరో హీరోయిన్లు చాలానే ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉండడానికి పోటీ పడుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్. ఇటీవలే భాగీ 2లో మాధురి దీక్షిత్ ఆల్ టైం హిట్ సాంగ్ వన్ టు త్రి రీమిక్స్ లో దుమ్ము రేపిన జాక్వలిన్ ఎల్లుండి విడుదల కాబోతున్న రేస్ 3 కోసం చాల యాంగ్జైటీతో ఎదురు చూస్తోంది. కారణం సల్మాన్ ఖాన్ తో రెండో సారి నటించడం కాదు. చాలా  రిస్క్ చేసి యాక్షన్ ఎపిసోడ్స్ చేయటం. అందుకోసం నిజంగా జిమ్ లో ఒళ్ళు వంచిన  జాక్వెలిన్ ఇందులో తన పెర్ఫార్మన్స్ తో కొత్త లెవెల్ కు వెళ్తాననే ఆశతో ఉంది. బాలీవుడ్ థ్రిల్లర్ మూవీస్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రేస్ సిరీస్ లో వస్తున్న మూడో భాగం ఇది. సల్మాన్ ఖాన్-బాబీ డియోల్ మొదటిసారి ఇందులో అన్నదమ్ములుగా నటించడం ఇప్పటికే ఆసక్తిని రెట్టింపు చేసింది.తాను ఎంత కష్టపడ్డానో చూపించేందుకు రుజువుగా జాక్వెలిన్ ట్రైనర్ తనకు కఠినమైన శిక్షణ ఇస్తున్న ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. పైన చూసారుగా. మాములుగా నడుము వంచి కింద పడిన దాన్ని తీసుకోవటానికి ఆపసోపాలు పడే సుకుమార హీరోయిన్లు  ఉండే ఇండస్ట్రీలో ఇలా ఒక కాలిని తలకు సమానంగా పైకెత్తి నిలబెట్టడం  అంటే మాటలా. అందుకే జాక్వలిన్ ని చూసి ఔరా అంటున్నారు ఫాన్స్. ఇటీవలే కంటికి జరిగిన ఆపరేషన్ వల్ల చిన్న లోపాన్ని జీవితాంతం భరించాల్సి వచ్చిన జాక్వెలైన్ దాన్ని లైట్ తీసుకోమని తన ఫాన్స్ కు హిత బోధ చేస్తోంది. ఒంటిని ఆరోగ్యంగా  మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ కలతలు అనారోగ్యం మన దరికి చేరవని హామీ ఇస్తోంది. ఈ ఫోటో చూస్తుంటే  నిజమే అనిపిస్తుంది కదా. అందుకే పెద్దలు అన్నది ఆరోగ్యమే మహాభాగ్యం. కాకపోతే అది సులభంగా రాదు కాబట్టి ఇలాంటి కసరత్తులు చేయాల్సిందే.