Begin typing your search above and press return to search.

ప్రభాస్ తీవ్రంగా శ్రమిస్తాడంటున్న శ్రీలంక భామ

By:  Tupaki Desk   |   21 Aug 2019 1:30 AM GMT
ప్రభాస్ తీవ్రంగా శ్రమిస్తాడంటున్న శ్రీలంక భామ
X
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి అంతా 'సాహో' పైనే ఉంది. సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ జోరుగా సాగుతోంది. ఒకవైపు ఇంటర్వ్యూలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ల లాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు.. మరోవైపు సాంగ్ రిలీజులు.. పోస్టర్లతో అంతటా 'సాహో' హంగామానే కనిపిస్తోంది. రీసెంట్ గా 'సాహో' నుంచి బ్యాడ్ బాయ్ అనే సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులేసింది. ఈ సినిమాలో జాక్వెలిన్ చేసింది ఒక పాటే అయినా అదో కలలాంటి అనుభవం అని చెప్తోంది.

రీసెంట్ గా జాక్వెలిన్ ఒక ఇంటర్వ్యూలో 'సాహో' ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ "ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో యాక్ట్ చేయడం కలలాంటి అనుభవం. అనుకున్న అవుట్ పుట్ వచ్చేవరకూ తీవ్రంగా శ్రమించే వ్యక్తి ప్రభాస్. నేను ప్రభాస్ తో ఎలాగైనా కలిసి నటించాలని అనుకున్నాను. నాకు ఈ పాట ఆఫర్ చేసినప్పుడు నేనెంతో ఎగ్జైట్ అయ్యాను. నాతో కలిసి స్టెప్స్ అనీ పర్ఫెక్ట్ గా వచ్చేవరకూ ప్రభాస్ రిహార్సల్స్ చేశాడు" అంటూ ప్రభాస్ పై ప్రశంసల కురిపించింది. ఈ పాటకు రెండున్నర రోజులు కలిసి పనిచేశామని అంతకు ముందు ఈ పాట కోసం రిహార్సల్ ఏమీ చేయలేదని వెల్లడించింది.

ర్యాపర్ బాద్షా - నీతి మోహన్ ఈ పాటకు బాణీ అందించడంతో పాటుగా పాడడం జరిగింది. 'బ్యాడ్ బాయ్' పాటకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీ వెర్షన్ సాంగ్ యూట్యూబ్ లో టాప్ 2 లో ట్రెండింగ్ అవుతోంది. విజువల్స్.. ఫీల్ అంతా బాలీవుడ్ సాంగ్ తరహాలోనే ఉన్నాయి.