పోల్ డ్యాన్స్ కి ప్రిపేర్ అయిపోండి

Thu May 17 2018 05:00:02 GMT+0530 (IST)

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చాలా విద్యలలో దిట్ట అనే సంగతి తెలిసిందే. ఈమె దగ్గర చాలానే కళలున్నాయి. వీటిలో ఒక్కొక్కదాన్ని బయటపెడుతూ ఉంటుంది. ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్ ను చూపించి.. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం ఈ అందగత్తె స్పెషాలిటీ.పోల్ డ్యాన్స్ ఎంత సంక్లిష్టమైన నృత్యరూపమో చెప్పాల్సిన పని లేదు. ఎటువంటి రోప్స్ ఉపయోగించకుండా.. కేవలం ఓ స్తంభాన్ని మాత్రమే ఆధారం చేసుకుని.. డ్యాన్స్ చేయాలంటే చాలానే సాధన కావాలి. కానీ డ్యాన్స్ లో జాకీకి బాగానే పట్టు ఉంది. గతంలో కొన్ని చిన్నపాటి వీడియోల ద్వారా పోల్ డ్యాన్స్ లో తన ట్యాలెంట్ ను అలా అలా పైపైన చూపించింది జాకీ. కానీ ఇప్పుడీ భామ తన ప్రతిభను ఫుల్లుగా చూపించేయడానికి రెడీ అయిపోతోంది. రేస్3 అంటూ రూపొందిన సల్మాన్ ఖాన్ మూవీలో.. జాక్వెలిన్ పోల్ డ్యాన్స్ కూడా ఉంటుందనే విషయం ట్రైలర్ ద్వారా చెప్పేశారు.

జాక్వెలిన్ పోల్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఒక్క బిట్ కూడా చూపించలేదు కానీ.. ఆ సెటప్ ను మాత్రం రేస్3 ట్రైలర్ లో ఉంచారు. జూన్ 15న థియేటర్లలోకి రానుంది రేస్3 మూవీ. ఈలోపుగా మరింతగా ప్రమోషనల్ మెటీరియల్ వస్తుంది కాబట్టి.. వాటిలో అయినా జాక్వెలిన్ పోల్ డ్యాన్స్ ను కొంత చూపించే ఛాన్స్ ఉంది. మరి జాక్వెలిన్ చూపించబోయే థ్రిల్లింగ్ డ్యాన్స్ చూసేందుకు మీరు ప్రిపేర్ అయిపోతున్నారా?